Bombay High Court: కన్న కూతురిపై తల్లి కేసు.. ఆమెకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న లాయర్.. కోర్టులో అనూహ్య ఘటన..!

ప్రతీకాత్మక చిత్రం

’నా పిటిషనర్ కూతురికి ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆమె ప్రవర్తన మంచిది కాదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు‘ అని లాయర్ చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే న్యాయమూర్తి కల్పించుకుని..

  • Share this:
    ఓ తల్లి తన కన్న కూతురిపైనే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరికొద్ది రోజుల్లో ఆమె ఆస్ట్రేలియాకు వెళ్తుందనగా ఆమెపై గృహ హింస కేసును నమోదు చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే గృహహింసకు తగిన ఆధారాలు చూపని ఆమె తరపు లాయర్ ఓ విచిత్ర వాదనను కోర్టు ముందుంచారు. ’ఆమెకు చాలా మంది లవర్స్ ఉన్నారు‘ అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ న్యాయమూర్తి వెంటనే కల్పించుకున్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన లాయర్ కు కోర్టులోనే చీవాట్లు పెట్టారు. అవన్నీ వదిలేసి లా పాయింట్లు మాట్లాడంటూ హితవు పలికారు. దీంతో ఆ లాయర్ కు తలకొట్టేసినట్టయింది. ఏం మాట్లాడాలో తెలియక మిన్నకుండి పోయారు. బాంబే హైకోర్టులో గురువారం జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ముంబై నగరానికి చెందిన ఓ మహిళ బాంబే హైకోర్టులో ఓ పిటిషన్ ను దాఖలు చేసింది. కూతురిపై గృహహింస కేసును నమోదు చేసింది. ఈ కేసు తరపున వాదించడానికి కెన్నీ థక్కర్ అనే న్యాయవాదిని ఆమె మాట్లాడుకుంది. కోర్టులో ఆమె తరపున వాధించిన కెన్నీ ఎన్నో విషయాలను న్యాయమూర్తి ముందుంచారు. తల్లిని చిత్రహింసలు పెట్టిందనీ, అన్నం పెట్టేది కూడా కాదనీ, అసభ్య పదజాలంతో దూషించేదనీ, కొట్టేదనీ ఎన్నో రకాలుగా వాదనలు వినిపించారు. అయితే వాటికి సంబంధించిన ఆధారాలను, సాక్షాలను మాత్రం చూపించలేకపోయారు.

    ఓ సందర్భంలో ’నా పిటిషనర్ కూతురికి ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆమె ప్రవర్తన మంచిది కాదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు‘ అని చెప్పుకొచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నడుస్తోంది ఆమె క్యారెక్టర్ గురించి కాదనీ, లా పాయింట్ల మీద మాట్లాడండంటూ లాయర్ కు న్యాయమూర్తి హితవు పలికారు. ’ఇదేం పిచ్చి వాదన. అది ఆమె జీవితం. ఆమె ఇష్టం. ఆమెకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న దాని గురించి కాదు ఇక్కడ కేసు నడుస్తోంది. పిటిషనర్ వాదనకు సంబంధించిన లా పాయింట్లను మాత్రమే మాట్లాడండి‘ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించడంతో లాయర్ క్షమాపణ చెప్పారు. కాగా, పిటిషనర్ కూతురు త్వరలోనే ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. ఆమె ఉన్నత చదువుల నిమిత్తం వీసా కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకుంది. ‘కూతురు విదేశాల్లో చదువుకుంటే తల్లి గర్వపడాలంటూ కూడా న్యాయమూర్తి కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఏప్రిల్ 19 వ తేదీకి తుది తీర్పును వాయిదా వేశారు.
    Published by:Hasaan Kandula
    First published: