BOMBAY HC UPHOLDS ORDER ASKING DIVORCED WOMAN TO PAY ALIMONY TO EXHUSBAND PAH
Bombay HC: సీన్ రివర్స్.. విడాకులు తీసుకున్న మాజీ భర్తకు భార్య మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే.. బాంబె హైకోర్టు..
ప్రతీకాత్మక చిత్రం
Divorce Case: సాధారణంగా విడాకులు తీసుకున్న కేసులలో ఎక్కువగా, భర్త.. భార్యకు భరణం చెల్లించానేది మనం వార్తలలో చదువుతుంటాం. కానీ బాంబె హైకోర్టు విడాకులు తీసుకున్న భార్య.. భర్తకు ప్రతి నెల భరణం చెల్లించాలని బాంబె హైకోర్టు ఆదేశించింది.
Bombay HC upholds order to divorced woman: బాంబె హైకోర్టు గురువారం ఒక మహిళ విడాకుల కేసులో వినూత్నంగా తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న భార్య ఇది వరకే ప్రభుత్వ ఉద్యోగి. ఆమె భర్తకు ఎలాంటి ఆధారం లేదు. దీని కోసం ప్రతి నెల మెయింటెనేన్స్ కింద భరణం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తొలుత ఈ కేసులో తనను పోషించుకోవడానికి తగిన స్తోమత లేదని భార్యతో విడాకులు తీసుకున్న వ్యక్తి, నాందేడ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని విచారించిన కోర్టు.. ఉపాధ్యాయురాలైన అతని భార్య.. ప్రతి నెల భర్తకు మెయింటెనెన్స్ కింద భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ క్రమంలో 2015 లో నాందేడ్ కోర్టు విడాకులు మంజురు చేసింది.
అయితే, దీన్ని సవాలు చేస్తు సదరు మహిళ.. బాంబె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్నివిచారించిన కోర్టు.. ఈ విషయంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ మహిళ ఔరంగా బాద్ కోర్టులో 2017లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు భర్తకు ప్రతి నెల 3000ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. దీనికి ఆమె నిరాకరించింది.
ఈ క్రమంలో.. 2019 లో కోర్టు.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి .. ప్రతి నెల ఆమె శాలరీ నుంచి 5000 రూపాయల కోత విధించి కోర్టుకు చెల్లించాలని ఆదేశించింది. దీనిపై సదరు మహిళ.. ప్రత్యేక రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది. చట్టం లోని సెక్షన్ 25 ప్రకారం, అతనికి జీవిత కాలం లేదా ఏక మొత్తంలో మెయింటెన్స్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.
అసలు వీరి మధ్య ఉన్న కేసు ఏంటంటే..
వీరిద్దరు మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందినవారు . వీరికి 1992 ఏప్రిల్ 17 వివాహం జరిగింది. ఆ తర్వాత.. భార్య వేధింపులు తాళలేక వీరు విడాకులు తీసుకున్నారు. అతను ఎలాంటి ఉద్యోగం చేసే స్తోమత కలిగి లేడు. అతని భార్య ఉపాధ్యాయురాలు. ఆమెకు ప్రతినెల జీతం వస్తుంది. ఈ క్రమంలో 2015 లో నాందేడ్ కోర్టు విడాకులు మంజురు చేసింది. తన భార్య కోసం తన జీవితం త్యాగం చేశానని.. ఈ రోజు ఉద్యోగం రావడంతో తనను వద్దను కుంటుందని కోర్టు వారికి తెలిపాడు.
ఆమెకు ఉద్యోగం కోసం నా జీవితాన్ని ఆమె కోసం త్యాగం చేశానిని విన్నవించాడు. ప్రస్తుతం తన భార్యకు నెలకు 30 వేలు జీతం వస్తుందని, దానిలో సగం 15 వేలు నాకు.. భరణంగా ఇప్పియాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ మేరకు ప్రస్తుతం బాంబే హైకోర్టు.. భర్తకు ప్రతినెల మెయింటెన్స్ ఇవ్వాలని ఆదేశించింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.