హోమ్ /వార్తలు /క్రైమ్ /

Bomb Attack: మరోసారి ఉలిక్కిపడిన బీహార్.. సీఎం నితీష్ కుమార్ సభలో బాంబుదాడి..

Bomb Attack: మరోసారి ఉలిక్కిపడిన బీహార్.. సీఎం నితీష్ కుమార్ సభలో బాంబుదాడి..

సభలో పాల్గొన్న నితీష్ కుమార్

సభలో పాల్గొన్న నితీష్ కుమార్

Cm Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొన్న సభలో గుర్తుతెలియని దుండగుడు బాంబుతో దాడికి పాల్పడ్డాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

Bomb Hurled Near Bihar CM Nitish Kumar Jansabha: నితీష్ కుమార్ కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళ వారం ఆయన నలందలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి నితీష్ కుమార్ ఉన్న వేదికపై బాంబును విసిరాడు. దీంతో అతడిని అదుపులోనికి తీసుకున్నారు. నితీష్ కుమార్ 'జనసభ' కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయనకు సమీపంలో ఒక వ్యక్తి బాంబు విసిరాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలో కూడా ఒక యువకుడు నితీష్ కుమార్ పై దాడికి పాల్పడ్డాడు. పాట్నాలోని టర్ఫ్ భక్తియార్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఒక వ్యక్తి నితిష్ కుమార్ పై (Bihar CM Nitish Kumar) దాడిచేసి ఆయన చెంపలపై కొట్టాడు. సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు నిర్ధారించారు.

సీఎం సభలో బాంబు పేలుడు శబ్దం రావడంతో అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. జనసభకు సమీపంలో ఒక వ్యక్తి పేలుడు పదార్థం ను విసిరినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే సీఎం నితీష్ కుమార్ కు (Bihar CM Nitish Kumar) సెక్యురీటి సిబ్బంది ఒక వలయంలా ఏర్పడ్డారు. అక్కడి నుంచి సీఎం ను తరలించారు. దీంతొ సభకు హజరైన ప్రజలు పరుగులు తీశారు. అక్కడ తీవ్ర గందర గోళం నెలకొంది.

అధికారులు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పెషల్ పోలీసులు రంగంలోనికి దిగారు. అడుగడుగున జల్లెడ పట్టారు. ఈ క్రమంలో.. అక్కడ కాసేపటి తర్వాత అది బాణసంచా బాంబు అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Bomb attack, Nitish Kumar

ఉత్తమ కథలు