పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి... 40మంది మృతి

పెళ్లికి దాదాపు వేయిమంది వరకు అతిథులు హాజరైనట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిపిస్తున్నాయి.

news18-telugu
Updated: August 18, 2019, 11:30 AM IST
పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి... 40మంది మృతి
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి
  • Share this:
అఫ్గానిస్థాన్‌‌లో మరోసారి నెత్తురోడింది. కాబూల్‌లో బాంబు బ్లాస్ట్ జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుక జరుగుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ బాంబ్ దాడిలో సుమారుగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిపిస్తున్నాయి. పెళ్లికి దాదాపు వేయిమంది వరకు అతిథులు హాజరైనట్లు సమాచారం. అందరూ పెళ్లి వేడుకలో బిజీగా ఎన్న సమయంలో దుండగుడు ఆత్మహుతికి పాల్పడినట్లు తెలుస్తోంది. పెళ్లి వేదికపై సంగీత బృందం ప్రదర్శన ఇస్తున్న సమయంలో అతిథులంతా అక్కడ గుమిగూడారని, ఆ సమయంలో దుండగుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం జరిగిన ఉగ్రదాడుల్లో ఇదే అతిపెద్దది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మృతుల సంఖ్యపై అక్కడి ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు దాడికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించనప్పటికీ.. స్థానిక ఇస్లాం ఉగ్రముఠాలతో కలిసి తాలిబన్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.




First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...