డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పేరిట సెక్స్ రాకెట్... బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్...

‘బాలీవుడ్ హబ్’ పేరిట ముంబైలో డ్యాన్స్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్న అగ్నేష్ హామిల్టన్... డ్యాన్స్ ప్రోగ్రామ్‌ల పేరుతో విదేశాలకు అమ్మాయిల సరాఫరా... అక్కడెక్కెళ్లిన మహిళలతో బలవంతంగా వ్యభిచారం... కెన్యాలో వెలుగుచూసిన దారుణం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 16, 2018, 3:33 PM IST
డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పేరిట సెక్స్ రాకెట్... బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్...
సల్మాన్ ఖాన్‌తో హామిల్టన్ (Photo: Facebook)
  • Share this:
బాలీవుడ్‌ను ‘మీటూ’ మూమెంట్ కుదిపేస్తున్న సమయంలో ఓ బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్న కేసులో అరెస్ట్ అవ్వడం సంచలనం క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన కొన్ని సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా వ్యవహారించిన అగ్నేష్ హామిల్టన్ అనే మహిళను ముంబై పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తోందనే అనుమానంతో అరెస్ట్ చేశారు. అయితే ఆమెను ప్రశ్నించిన ముంబై పోలీసులకు పెద్ద షాక్ తగిలింది. డ్యాన్స్ ప్రోగ్రామ్‌ల పేరిట హామిల్టన్ ఏకంగా అంతర్జాతీయంగా వ్యభిచార రాకెట్ నిర్వహిస్తోందని తెలిసి అవాక్కయ్యారు.

కొన్ని బాలీవుడ్ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన 56 ఏళ్ల అగ్నేష్ హామిల్టన్ తరుచూ మలేషియా, బ్యాంకాక్, అమెరికా వంటి దేశాలకు రాకపోకలు సాగిస్తోంది. ఆమె వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తోందేమోననే అనుమానంతో నిఘా వేసి పక్కా సమాచారంతో అంధేరిలోని లోఖండావాలాలో అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. అయితే ఆమెను విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిశాయి. ‘బాలీవుడ్ హబ్’ పేరిట డ్యాన్స్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్న అగ్నేష్ హామిల్టన్... విదేశాల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు ఇవ్వాలని చెప్పి అమ్మాయిలను కెన్యా, బహ్రెయిన్, దుబాయ్ వంటి విదేశాలకు పంపిస్తోంది. అక్కడికి వెళ్లిన తర్వాత వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. అలా కెన్యాలో వ్యభిచారం ఊబిలో ఇరుక్కున్న ఓ మహిళను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హామిల్టర్ సోషల్ మీడియా ఖాతాలను పరీక్షించిన పోలీసులకు సల్మాన్‌ఖాన్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులతో ఆమె దిగిన ఫోటోలు కనిపించాయి. వీరికి ఈ రాకెట్‌తో సంబంధం ఉందా... లేక ఆ ఫోటోలను చూపించి పాపులారిటీ తెచ్చుకునేందుకు వాటిని పోస్ట్ చేసిందా... అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విదేశాల్లో నృత్య ప్రదర్శనలు ఉన్నాయని చెప్పి, ఒక్కో అమ్మాయి నుంచి ఖర్చుల కింద రూ. 40 వేలు వసూలు చేసినట్టు తెలిసింది.

First published: November 16, 2018, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading