Attack on animals: మూగజీవాలపై ఆగని దాడులు.. నటి పెంపుడు కుక్కను చంపిన సంరక్షకుడు

Attack on animals: దేశవ్యాప్తంగా మూగజీవాలపై దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ నటి ఆయేశా జుక్లా(Ayesha Jhulka) పెంపుడు కుక్కను ఆమె ఇంట్లో పనిచేసే వ్యక్తే చంపాడు.

news18-telugu
Updated: September 27, 2020, 7:20 PM IST
Attack on animals: మూగజీవాలపై ఆగని దాడులు.. నటి పెంపుడు కుక్కను చంపిన సంరక్షకుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా మూగజీవాలపై దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మానవత్వం లేని కొందరు మూగజీవాలను హింసించి చంపేస్తున్నారు. తాజాగా పెంపుడు కుక్కను ఓ వ్యక్తి చంపిన ఘటన ముంబైలోని బాలీవుడ్ నటి నివాసంలో చోటు చేసుకుంది. నటి ఆయేశా జుక్లా(Ayesha Jhulka) పెంపుడు కుక్కను వాటి సంరక్షకుడిగా నియమించిన ఓ వ్యక్తి చంపేశాడు. ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో నటి ఆయేశా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు విచారణ చేపట్టి నటి ఇంట్లో పనిచేసే రామ్ ఆంద్రే(49) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కుక్క ఊపిరాడక చనిపోయినట్లు శవపరీక్షలో తేలిందని స్థానిక ఎస్ఐ బిలారామ్ తెలిపారు. నటి ఇంట్లో పనిచేసే ఇతర సిబ్బంది, పక్క నివాసాల వారి స్టేట్మెంట్ ఆధారంగా రామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. అయితే నిందితుడు కుక్క నీటి తొట్టెలో మునిగి చనిపోయినట్లు ఆయేశా భర్తకు అబద్ధం చెప్పాడు.

కొద్ది నెలల క్రితం కేరళలోని పాలక్కడ్‌లో గర్భంతో ఉన్న ఏనుగు నోట్లో బాంబు పేలడంతో అది తీవ్రమైన వేదన అనుభవించి చివరకు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఏనుగును చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కేంద్ర మంత్రుల నుంచి బాలీవుడ్ ప్రముఖుల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

అనంతరం హిమాచల్ ప్రదేశ్ లో గర్భంతో ఉన్న ఓ ఆవు నోటిలో బాంబు పేలిన ఘటనపై కూడా దేశ వ్యాప్తంగా అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. తన ఇంటి పొరుగున ఉన్న నందలాల్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆవు యజమాని సింగ్ ఆ సమయంలో ఆరోపించాడు. కొద్ది రోజులకు ఖమ్మం జిల్లాలో ఓ కోతిని కొందరు దారుణంగా చెట్టుకు ఉరేసి చంపారు.
Published by: Nikhil Kumar S
First published: September 27, 2020, 7:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading