కొబ్బరి బోండాల వాహనం బోల్తా.. యాక్సిడెంట్‌తో బట్టబయలైన అసలు సీక్రెట్..

కొబ్బరి బోండాల లోడ్‌తో వెళ్తున్న ఆ వాహనంలో.. బోండాల మాటున గంజాయిని తరలిస్తున్నారు.దాదాపు 246 కిలోల గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు.

news18-telugu
Updated: September 13, 2019, 2:50 PM IST
కొబ్బరి బోండాల వాహనం బోల్తా.. యాక్సిడెంట్‌తో బట్టబయలైన అసలు సీక్రెట్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్‌లో ఓ బొలెరో వాహనం బోల్తా కొట్టింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బొలెరో వాహనాన్ని పరిశీలించగా.. అసలు రహస్యం బట్టబయలైంది.కొబ్బరి బోండాల లోడ్‌తో వెళ్తున్న ఆ వాహనంలో.. బోండాల మాటున గంజాయిని తరలిస్తున్నారు.దాదాపు 246 కిలోల గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. దాని విలువ దాదాపు రూ.7.30లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదం అనంతరం బొలెరో డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం. ఒడిశా నుంచి వస్తున్న ఈ వాహనంలో హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు నిర్దారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు