అసోంలోని బ్రహ్మపుత్రా నదిలో ఘోర ప్రమాదం(Accedent) చోటు చేసుకొంది. రెండు పడవలు ఢీకొన్నాయి. ఈ పడవల్లో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 50మంది దాకా గల్లంతయ్యారు. 40 మందిని కాపాడారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఏం జరిగింది?
అసోంలోని బ్రహ్మపుత్ర నది ( Brahmaputra ) లో జోర్హాత్ వద్ద రెండు పడవలు ఢీ కొననాయి. ఒక బోటు మజులీ నుంచి నిమతి ఘాట్‌కు వస్తుండగా, మరో బోటు వ్యతిరేక దిశలో వెళ్తోంది. రెండు పడవలు ఢీకొనడంతో.. దాంట్లో ఉన్న ప్రయాణికులు నీటిలో పడ్డారు. పలువురు నీటిలో కొట్టుకు పోయారు. కొందరు తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు పడవలను పట్టుకున్నారు. ఒడ్డుకు చేరేందుకు యత్నించారు. అయినా కొందరు గల్లంతయ్యారు. ఈ ఘటన అసోం రాజధాని గుహవాటికి 350 కి.మీ దూరంలో జరిగింది.
సహాయక చర్యలు వేగవంతం చేయాలి : అసోం సీఎం హిమాంత బిశ్వా
ఈ దుర్ఘటనపై అసోం సీఎం హిమాంత బిశ్వా స్పందించారు. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. NDRF & SDRF సహాయంతో రెస్క్యూ మిషన్ వేగవంతంగా చేపట్టాలని అధికారులు ఇప్పటికే ఆదేశంచారు.
మజులి & జోర్హాట్ జిల్లా యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. సహాయక చర్యలు పర్యవేక్షించడానికి సీఎం హిమాంత బిశ్వా ఘటనాస్థలాన్ని రేపటి లోపు సందర్శించే అవకాశం ఉంది. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్ కుమార్ సిన్హాను ఈ పరిణామాలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.
Anguished to learn of the ferry accident in Majuli. I have talked with Assam CM Shri @himantabiswa regarding the accident and he has informed me of ongoing rescue and relief operations.
I have directed @shipmin_india to provide all necessary support to help the victims.
— Sarbananda Sonowal (@sarbanandsonwal) September 8, 2021
40 మందిని రక్షించిన సహాయక బృందాలు..
ఈ ఘటనలో సుమారు 50 మందిపైనే తప్పిపోయినట్టు సహాయక బృందాలు భావిస్తున్నాయి. ఇప్పటికే 40 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 12 వ బెటాలియన్ నుండి 1 NDRF బృందం ఇప్పటికే సహాయ చర్యలు నిర్వహిస్తోంది. దోయిముఖ్ అరుణాచల్‌లో ఉన్న మరో 2 NDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనన్నాయి. ప్రయాణికుల ఆర్తనాదాలతో నదీతీరం అంతా గంభీర వాతావరణం ఏర్పడింది. ఆప్తులను కోల్పోయిన ప్రజల రోదనలు మిన్నంటాయి. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఎంత మంది తప్పిపోయారు.
కేంద్ర మంత్రి ట్వీట్..
ఈ ఘటనపై మాజీ అసోం సీఎం, ప్రస్తుత కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి, ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సహాయం కావాలన్నా అందిస్తామన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ప్రమాదంపై అసోం డిపార్ట్‌మెంట్ ఆప్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (Department of Information and Public Relations) ప్రకటన చేసింది ఎవరైన తప్పిపోయిన వారు, ఆచూకీ తెలియని వారు ఉంటే వారి సమాచారాన్ని డిస్టిక్ట్ ఎమెర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (District Emergency Operation Center) కి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలన్నారు.
టోల్ ఫ్రీ నంబర్ -1077
మొబైల్ నంబర్ - 7635961522
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assam, Boat accident