స్విగ్గీ డామేజ్.. .నూడిల్స్‌లో బ్లడ్ ఉన్న బ్యాండేజ్

సగం ప్యాకెట్ వరకు బాగానే తిన్నాడు. సగం నూడిల్స్ తినగానే ఆ ఫుడ్ ప్యాకెట్లో బాండేజ్ కనిపించింది. బ్లడ్ అంటి ఉన్న బ్యాండేజ్ నూడిల్స్‌లో కనిపించగానే కస్టమర్ షాక్ అయ్యాడు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 13, 2019, 3:19 PM IST
స్విగ్గీ డామేజ్.. .నూడిల్స్‌లో బ్లడ్ ఉన్న బ్యాండేజ్
స్విగ్గీ డెలివరీ చేసిన ఫుడ్‌లో బ్యాండేజ్
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 13, 2019, 3:19 PM IST
స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. మొన్న జుమాటో ఆర్డర్ చేసిన ఫుడ్‌లో కస్టమర్లకు ఫైబర్ కనిపిస్తే.. తాజాగా స్విగ్గీ డెలివరీ చేసిన ఫుడ్‌లో రక్తం మరకలున్న బ్యాండేజ్ ప్రత్యక్షమైంది. దీంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భయపడుతున్నారు జనం. చెన్నైకు చెందిన బాలమురుగున్న అనే వ్యక్తి స్విగ్గి ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన నూడిల్స్ తెప్పించుకొని తింటున్నాడు. సగం ప్యాకెట్ వరకు బాగానే తిన్నాడు. సగం నూడిల్స్ తినగానే ఆ ఫుడ్ ప్యాకెట్లో బాండేజ్ కనిపించింది. బ్లడ్ అంటి ఉన్న బ్యాండేజ్ నూడిల్స్‌లో కనిపించగానే కస్టమర్ షాక్ అయ్యాడు. ఇదేం ఫుడ్‌రా బాబు అంటూ నూడిల్స్‌ను డెలివరీ చేసిన రెస్టారెంట్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ హోటల్ నిర్వాహకులు దీనిపై ఏ మాత్రం స్పందించలేదు. కనీసం ఆ ఫుడ్ ప్లేస్‌లో వేరే ఆహారాన్ని కూడా అందివ్వలేదు. స్విగ్గీకు ఫిర్యాదు చేద్దామంటే కాంటాక్ట్ చేసేందుకు ఎలాంటి ఫోన్ నెంబర్ లేదు.

దీంతో నూడిల్స్‌లో గుర్తంచిన బ్యాండేజ్‌ను ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. దీంతో ఈ ఘటనపై స్విగ్గీ స్పందించింది. సంబంధింత రెస్టారెంట్‌ను తమ గ్రూప్ నుంచి తొలగించినట్లు పేర్కొంది. కస్టమర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ఆహార భద్రతకు, నాణ్యతకు స్విగ్గీ కట్టుబడి ఉంటుందని పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు వచ్చాక దీనిపై సమగ్ర విచారణ చేపడతామన్నారు.First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...