స్కూల్ ఫీజు కట్టలేదని... ఎండలో నిలబడిన రెండో తరగతి విద్యార్థులు

బాధిత పిల్లల తల్లిదండ్రులు లాస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫీజు చెల్లించలేకపోయారు. దీంతో వారి పిల్లలని స్కూల్ మేనేజ్ మెంట్ పరీక్షలకు కూడా అనుమతించలేదని బాలల హక్కుల సంఘం నేతలు చెబుతున్నారు.

news18-telugu
Updated: March 31, 2019, 10:45 AM IST
స్కూల్ ఫీజు కట్టలేదని... ఎండలో నిలబడిన రెండో తరగతి విద్యార్థులు
నమూనా చిత్రం
  • Share this:
రోజురోజుకు ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అత్యధిక ఫీజులు ముక్కుపిండి మరి వసూలు చేసే... విద్యాసంస్థలు అభం శుభం తెలియని పసివాళ్లను సైతం నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కేరళలో ఓ స్కూల్ యాజమాన్యం కనీస మానవత్వం లేకుండా వ్యవహరించింది. స్కూల్ ఫీజు చెల్లించలేదని ఇద్దరు విద్యార్థుల్ని యజమాన్యం దారుణంగా శిక్షించింది. రెండో తరగతి చదువుతున్న చిన్నారులపై కనికరం లేకుండా ఎండలో రెండు గంటలపాటు నిల్చోబెట్టింది. ఇందులో ఒకరు అంధ విద్యార్థి కావడంతో కళ్లు తిరిగి పడిపోయాను. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేరళ బాలల హక్కుల సంఘం స్పందించింది .

మరోవైపు కేళ మానవ హక్కుల సంఘంలో కూడా ఫిర్యాదు అందింది. దీనిపై HRC స్కూల్‌పై కేసు నమోదు చేసింది. కరమల్లూరు దగ్గరలోని అలువలోని ప్రైవేట్ స్కూల్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. రెండోతరగతి చదువుతున్న చిన్నారుల్ని స్కూల్ సిబ్బంది ఎండలో నిల్చోబెట్టారు. ఎండను తట్టుకోలేక వారిలో ఒకరైన అంధ విద్యార్థి కళ్లు తిరిగి పడిపోయి... ఆస్పత్పిపాలయ్యారు. బాధిత పిల్లల తల్లిదండ్రులు లాస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫీజు చెల్లించలేకపోయారు. దీంతో వారి పిల్లలని స్కూల్ మేనేజ్ మెంట్ పరీక్షలకు కూడా అనుమతించలేదని బాలల హక్కుల సంఘం నేతలు చెబుతున్నారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
First published: March 31, 2019, 10:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading