Blasts Inside Vans : అప్ఘానిస్తాన్ లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఉత్తర అప్ఘానిస్తాన్ లో గురువారం రాత్రి రెండు మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు ఐఎస్‌ఐఎస్ (ISIS) తీవ్రవాదులు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఈ-షరీఫ్ లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్ అధికారులు తెలిపారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు పేలుళ్లు జరిగాయని తెలిపారు.
రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా,మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్‌ఐఎస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. తాలిబన్ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. కాగా, గత వారమే అప్ఘానిస్తాన్ లో మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించారు. మరో 43 మందికి గాయాలయ్యాయి. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Bomb blast