హోమ్ /వార్తలు /క్రైమ్ /

Blast: మసీదు వద్ద ఆత్మాహుతి దాడి..50మందికి పైగా మృతి

Blast: మసీదు వద్ద ఆత్మాహుతి దాడి..50మందికి పైగా మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Blast : ఖలీఫా సాహిబ్‌ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం రంజాన్‌ ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.

ఇంకా చదవండి ...

Sucide Blast : అప్ఘానిస్తాన్ (Afghanistan)లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. రాజధాని కాబుల్‌ లోని ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. కాబుల్‌ లోని స్థానిక ఖలీఫా సాహిబ్‌ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం రంజాన్‌ ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఘటన తర్వాత ఎటు చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలే కన్పిస్తున్నాయని ప్రత్యక్ష సాక్ష్యులుతెలిపారు. ఈ పేలుడు వెనుక ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

కాగా, రంజాన్‌ నెల ఆరంభం తర్వాత గత కొద్ది రోజులుగా అప్ఘానిస్తాన్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గత 10 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో 11 ఉగ్రదాడులు సంభవించాయి. వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర అప్ఘానిస్తాన్ లో గురువారం రాత్రి రెండు మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు ఐఎస్‌ఐఎస్‌ (ISIS) తీవ్రవాదులు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఈ-షరీఫ్‌ లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్‌ అధికారులు తెలిపారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు పేలుళ్లు జరిగాయని తెలిపారు. రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా,మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది. తాలిబన్ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. కాగా, గత వారమే అప్ఘానిస్తాన్ లో మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించారు. మరో 43 మందికి గాయాలయ్యాయి. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Afghanistan, Bomb blast

ఉత్తమ కథలు