BLAST IN MANIPUR HOURS BEFORE ELECTIONS 2 KILLED AND 5 INJURED PVN
Explosion : అసెంబ్లీ ఎన్నికల ముందు మణిపూర్ లో భారీ పేలుడు..మృతుల్లో చిన్నారి కూడా
(ప్రతీకాత్మక చిత్రం)
Explosion In Manipur : శనివారం రాత్రి జరిగిన బాంబు పేలుడే అతిపెద్ద హింసాత్మక ఘటన. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీకి సోమ(ఫిబ్రవరి-28), శనివారం(మార్చి-5) రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Blast In Manipur : మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ పేలుడు కలకలం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు పేలుడు సంభవించింది. శనివారం రాత్రి చురాచాంద్ పూర్ జిల్లాలోని గంగ్పిమౌల్ గ్రామంలోని ఓ ఇంట్లో సంభవించిన పేలుడు కారణంగా ఇద్దరు మరణించగా,ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన ఇద్దరిలో 6 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.
గాయపడిన వారికి జిల్లా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా,పేలుడుకి మోర్టార్ కారణమని ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఈ పేలుడికి బాధ్యలైన వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
గత నెల 8న కేంద్ర ఎన్నికల సంఘం మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత.... శనివారం రాత్రి జరిగిన బాంబు పేలుడే అతిపెద్ద హింసాత్మక ఘటన. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీకి సోమ(ఫిబ్రవరి-28), శనివారం(మార్చి-5) రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బాంబు పేలుడు నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. పోలింగ్ సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.