హైదరాబాద్ మీర్‌పేట్‌లో పేలిన బాక్స్... మహిళకు గాయాలు

మీర్ పేట్‌లోని విజయపురి కాలనీలో చెత్తకుప్ప దగ్గర ఓ బాక్స్ కనిపించింది. అయితే, అందులో ఏముందో చూసేందుకు ఆమె ప్రయత్నించింది.

news18-telugu
Updated: November 8, 2019, 3:25 PM IST
హైదరాబాద్ మీర్‌పేట్‌లో పేలిన బాక్స్... మహిళకు గాయాలు
మీర్‌పేట్‌ పేలుడులో గాయపడిన మహిళ
news18-telugu
Updated: November 8, 2019, 3:25 PM IST
హైదరాబాద్ శివారు మీర్‌పేట్‌లో ఓ బాక్స్ పేలింది. ఈ ఘటనలో చెత్త ఏరుకునే ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. నిర్మల అనే చెత్త ఏరుకునే మహిళకు.. మీర్ పేట్‌లోని విజయపురి కాలనీలో చెత్తకుప్ప దగ్గర ఓ బాక్స్ కనిపించింది. అయితే, అందులో ఏముందో చూసేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ, బాక్స్ మూత తెరుచుకోకపోవడంతో ఆ బాక్స్‌ను గట్టిగా నేలకు వేసి కొట్టింది. దీంతో బాక్స్‌ పేలిపోయింది. ఈ పేలుడులో ఆమెకు తీవ్రగా గాయాలయ్యాయి. పాదం పైభాగం రక్తసిక్తమైంది. గట్టిగా పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు భయంతో బయటకు పరిగెత్తారు. చెత్తకుప్ప దగ్గర పడి ఉన్న మహిళను చూసి షాక్‌ తిన్నారు. బాక్స్ పేలినట్టు ఆమె చెప్పింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్‌ను రప్పించి.. ఆ చెత్తకుప్ప, చుట్టుపక్కల ప్రాంతాలో తనిఖీలు చేశారు. ఆ బాక్స్‌లో గడువు ముగిసిన కెమికల్ ఉండొచ్చని భావిస్తున్నారు.

First published: November 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...