BLAST AT CHEMICAL FACTORY IN GUJARAT BHARUCH 6 KILLED PVN
Blast: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు కార్మికులు మృతి
(ప్రతీకాత్మక చిత్రం)
Blast at chemical factory : గుజరాత్(Gujarat)లోని భరూచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి.
Blast at chemical factory : గుజరాత్(Gujarat)లోని భరూచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి. రియాక్టర్ వద్ద కార్మికులు పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు(Blast)సంభవించింది. పేలుడు కారణంగా ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మంటల్లో చిక్కుకొని మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడి హాస్పిటల్ కు తరలించారు. మంటలు ఆర్పిన అనంతరం మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లు పెర్కోన్నారు. అయితే ఈ ప్రమాదంలో మరెవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు,గతేడాది ఆగస్టులో కూడా ఇదే పారిశ్రామిక వాడలోని మరో రసాయన కంపెనీలో పెలుడు సంభవించింది. ఆ ఘటనలో ఓ కార్మికుడులు దర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.