Nellore: నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం

కడప జిల్లా కమలాపురానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి తమపై క్షుద్రపూజలు చేశారని ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Updated: February 20, 2020, 1:41 PM IST
Nellore: నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెల్లూరు జిల్లాలో తమపై క్షుద్రపూజల జరిగినట్టు ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. కడప జిల్లా కమలాపురానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి తమపై క్షుద్రపూజలు చేశారని ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ తల్లిదండ్రులే తమపై ఈ రకమైన పూజలు చేయించారని ఆరోపించారు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మునిభార్గవ్, ప్రత్యూష పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి భర్తను వదిలిరావాలని ప్రత్యూషపై ఆమె తల్లిదండ్రుల ఒత్తిడి తీసుకొస్తున్నారు.

అయితే ప్రత్యూష మాత్రం తాను భర్తను వదిలి రానని వారికి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు తనపై బాణామతి చేయించారని ప్రత్యూష, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా కమలాపురానికి చెందిన పవన్ క్షుద్రపూజలు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తాను ఎలాంటి క్షుద్రపూజలు చేయలేదని... కేవలం గణపతి పూజలు మాత్రమే చేశానని పవన్ కుమార్ పోలీసులకు తెలిపారు. మరోవైపు తమకు క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం లేదని ప్రత్యూష తల్లిదండ్రులు వాదిస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: February 20, 2020, 1:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading