ఓం...క్రీం...హ్రీమ్... అన్నాడు... యువతిని రేప్ చేశాడు

Crime : మన చుట్టూ ఉన్న సమాజంలో దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. ఎవర్ని బడితే వాళ్లను నమ్మితే ప్రమాదం. అందుకు ఈ దారుణమే ఓ ఉదాహరణ.

news18-telugu
Updated: December 13, 2019, 6:42 AM IST
ఓం...క్రీం...హ్రీమ్... అన్నాడు... యువతిని రేప్ చేశాడు
ఓం...క్రీం...హ్రీమ్... అన్నాడు... మహిళను రేప్ చేశాడు
  • Share this:
Crime : 2019 ఏప్రిల్. మధ్యప్రదేశ్. అప్పుడే ఎండలు మండుతున్నాయి. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 6 నెలలు గడిచాయి. ఇద్దరి మధ్యా గొడవలు. ఆవేశంలో ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. భార్యకు దూరమైన నెలైంది. ఆమె లేని లోటు తెలిసొచ్చింది. మనసు మారింది. మళ్లీ ఆమెను కలిసి క్షమించమన్నాడు. మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఆమె మనసు కరిగిపోయింది. సరేనంది. కట్ చేస్తే... ఓ మాంత్రికుణ్ని కలిశాడు. విషయం చెప్పాడు. అదెలా కుదురుతుంది... మళ్లీ ఆమెను ఎలా చేసుకుంటావ్ అని పిచ్చి ప్రశ్న వేశాడు. ఏం ఎందుకు చేసుకోకూడదు అని అతను ఎదురు ప్రశ్నించాడు. చేసుకోవచ్చనుకో... ఐతే... సంప్రదాయం ప్రకారం నిఖా హలాలా జరిపించాలి. అంటే... ఆమె మరో పెళ్లి చేసుకొని... తర్వాత నిన్ను చేసుకోవాలి అన్నాడు. ఆ తంతు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఆమెను నా ఫ్లాట్‌కి తీసుకురా అన్నాడు. సరేనన్న యువకుడు... వెళ్లి తన మాజీ భార్యకు అసలు విషయం చెప్పకుండా... ఆమెను మాంత్రికుడి ఫ్లాట్‌కి తీసుకెళ్లాడు. "నేను కొన్ని మంత్రాలు చదవాలి. నువ్వు బయట ఉండు" అని కుర్రాణ్ని బయటకు పంపాడు. ఆ తర్వాత తలుపులు వేసేసి... రకరకాలుగా అరుస్తూ... పిచ్చి పిచ్చి మంత్రాలు చదువుతూ... చివరకు ఆమెను రేప్ చేశాడు.

కాసేపటి తర్వాత ఫ్లాట్‌కి వచ్చిన యువకుడు... విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో మాజీ భర్త, మాంత్రికుడిపై కేసు పెట్టింది. పోలీసులు వాళ్లిద్దర్నీ అరెస్టు చేశారు. ఇదీ జరిగిన దారుణం. తిరిగి పెళ్లిచేసుకుంటాడనుకున్న వ్యక్తి... మరో దుర్మార్గుడి చేతిలో ఆమెను పెట్టాడు. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఆమెతో కలిసి కలకాలం జీవించాల్సిన వాడు... జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

 

Pics : క్యూట్ సింగర్ షిర్లీ సెషియా అందాలు


ఇవి కూడా చదవండి :

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంఅమ్మో కిలాడీ... డేటింగ్ పేరుతో రూ.73 లక్షలు దోపిడీ

గాలి నుంచి నీరు... లీటర్ రూ.5... ఎక్కడో తెలుసా?

Health Tips : గుండె ఫిట్‌గా ఉండాలా... ఈ 5 చిట్కాలు పాటించండి

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి
First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు