హోలీలో పోట్లాట.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫైరింగ్

హోలీ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, మరికొందరు కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది.

news18-telugu
Updated: March 21, 2019, 5:50 PM IST
హోలీలో పోట్లాట.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫైరింగ్
ప్రతీకాత్మక చిత్రం (Image: Reuters)
  • Share this:
హోలీ సందర్భంగా జరిగిన పోట్లాట ఓ ఎమ్మెల్యే ప్రాణాల మీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే మీద కాల్పులు జరిపారు. అయితే, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ, మరికొందరు హోలీ సందర్భం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యోగేష్ వర్మతో కొందరు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గట్టిగట్టిగా కేకలు వేసుకున్నారు. ఈ క్రమంలో వారు ఎమ్మెల్యే మీద కాల్పులు జరిపారు. అయితే, బుల్లెట్స్ కాలికి తగిలాయని, వెంటనే ఎమ్మెల్యేను ఆస్పత్రికి తీసుకెళ్లామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని జిల్లా మెజిస్ట్రేట్ ఖేరీ తెలిపారు.
First published: March 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading