బీజేపీ మహిళా ఎంపీ కుమారుడి డ్రంకన్ డ్రైవ్.. మద్యం మత్తులో రచ్చ..

ఘటనపై ఎంపీ రూప గంగూలీ మాట్లాడుతూ.. తన కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారని.. ఇందులో రాజకీయంగా తన జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: August 16, 2019, 9:27 AM IST
బీజేపీ మహిళా ఎంపీ కుమారుడి డ్రంకన్ డ్రైవ్.. మద్యం మత్తులో రచ్చ..
రూప గంగూలీ (File Photo)
news18-telugu
Updated: August 16, 2019, 9:27 AM IST
కోల్‌కతా బీజేపీ ఎంపీ రూప గంగూలీ కుమారుడు ఆకాష్ ముఖోపాధ్యాయ్(20) తాగి వాహనం నడిపి ఓ క్లబ్‌ గోడను ఢీకొట్టాడు. అతని రాష్ డ్రైవింగ్ నుంచి తృటిలో తప్పించుకున్నామని.. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగిపోయి ఉండేదని ఇతర వాహనదారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు.గురువారం అర్ధరాత్రి ముఖోపాధ్యాయ్ ఇంటి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కారు గోడను ఢీకొట్టడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. దాంతో సమీపంలోనే ఉన్న ముఖోపాధ్యాయ్ అపార్ట్‌మెంట్ నుంచి అతని తండ్రి బయటకొచ్చాడు. ముఖోపాధ్యాయ్ కారులో చిక్కుకుని ఉండటంతో మెల్లిగా బయటకు తీశారు. దీంతో స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముఖోపాధ్యాయ్‌ని జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై ఎంపీ రూప గంగూలీ మాట్లాడుతూ.. తన కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారని.. ఇందులో రాజకీయంగా తన జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు.

Loading...


First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...