• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • BJP MP FROM MANDI RAM SWAROOP SHARMA DIED ALLEGEDLY BY SUICIDE IN DELHI HERE IS DETAILS SK

బీజేపీ ఎంపీ ఆత్మహత్య...? హోటల్ గదిలో ఉరేసుకొని మృతి.. ఏం జరిగింది?

బీజేపీ ఎంపీ ఆత్మహత్య...? హోటల్ గదిలో ఉరేసుకొని మృతి.. ఏం జరిగింది?

రామ్ స్వరూప్ శర్మ

62 ఏళ్ల రామ్ స్వరూప్ శర్మ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మృతితో బీజేపీ పార్లమెంటరీ సమావేశం వాయిదా పడింది.

  • Share this:
    బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలో ఆయన ఉరి వేసుకొని మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గోమతి అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో రామ్ స్వరూప్ శర్మ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఫ్లాట్‌లో రామ్ స్వరూప్ శర్మ ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గోమతి అపార్ట్‌మెంట్ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. 62 ఏళ్ల రామ్ స్వరూప్ శర్మ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


    రామ్ స్వరూప్ శర్మ మృతితో బీజేపీ పార్లమెంటరీ సమావేశం వాయిదా పడింది. ఆయన 1958లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జన్మించారు. రామ్‌ స్వరూప్ శర్మకు భార్యా, ముగ్గురు కుమారులు ఉన్నారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఆయన ఎంపీగా గెలించారు. అనంతరం 2019 ఎన్నికల్లోనూ రెండోసారి విజయం సాధించారు.


    కాగా, గత నెలలో దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ (57) కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్‌లో ఆయన మరణించారు. ఘటనా స్థలాంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో గుజరాతీ భాషలో రాసి ఉంది. పలువురు సీనియర్ రాజకీయ నాయకులపై ఆరోపణలు చేశారు మోహన్ దేల్కర్. అంతలోనే మరో ఎంపీ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు