హోమ్ /వార్తలు /క్రైమ్ /

నేనెవరో మీకు తెలుసా.. అంటూ రెచ్చిపోయిన యువతి.. ట్రాఫిక్ పోలీసులపై చిందులు.. అసలేం జరిగిందంటే..

నేనెవరో మీకు తెలుసా.. అంటూ రెచ్చిపోయిన యువతి.. ట్రాఫిక్ పోలీసులపై చిందులు.. అసలేం జరిగిందంటే..

పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువతి

పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువతి

Karnataka: యువతి రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేసింది. అతి వేగంగా కారు నడుపుతూ సిగ్నల్ ను జంప్ చేసింది. అడ్డుకున్న పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించింది. 

కొందరు అధికారులు, రాజకీయ నేతల బిడ్డలు వాహానాలను ఇష్టారీతిన వెహికిల్స్ నడిపిస్తుంటారు. సిగ్నల్ లను క్రాస్ చేయడం, తాగి వాహనాలను నడిపించడం చేస్తుంటారు. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారింది. కర్ణాటక (Karnataka) మాజీ మంత్రి ,బీజేపీ ఎమ్మెల్యే (BJP MLAs Daughter Jumps Signal) అరవింద్ లింబావలి కుమార్తె అతివేగంతో కారును నడుపిస్తు.. సిగ్న‌ల్ జంప్ చేసింది. దీంతో ఆమె వాహ‌నాన్ని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఆమెకు జ‌రిమానా విధించారు. దీంతో ఎమ్మెల్యే కుమార్తె రెచ్చిపోయింది.

పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారిని నోటికి వ‌చ్చిన‌ట్టు తిట్టింది. అంత‌టితో ఆగ‌కుండా..ఈ ఘ‌ట‌న‌ను రికార్డు చేస్తున్న‌ ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై ఆమె చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌లవుతోంది. "నేనెవరో మీకు తెలుసా? మీకు ఎమ్మెల్యే అరవింద్ లింబావలి తెలుసా? నేను అరవింద్ లింబావలి కూతురిని" అని ఆ మహిళ ప్రశ్నించింది. మీడియాపై, పోలీసులపైన దాడికి ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమెను విడిచిపెట్టలేదు.

ఆమె న‌డుపుతున్న బీఎండబ్ల్యూ కారుపై (BMW Then A Row With Cops) రూ.9000 ల పెండింగ్ చలానాలు ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తాజాగా ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు సిగ్న‌ల్ జంపింగ్ కు మరో రూ.1,000 ఫైన్ వేసి మొత్తం రూ.10,000 చెల్లించాల‌ని చెప్పారు. కొద్దిసేపు.. వాదించిన ఎమ్మెల్యే కుమార్తె చివరకు .. మొత్తం చ‌లానాల‌ను చెల్లించి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు స‌మాచారం. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా కర్ణాటకలోనే వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే కోపంతో తండ్రి సొంత కూతురినే హతమార్చాడు.

కర్ణాటకలో (karnataka) పరువు హత్య వార్తలలో నిలిచింది. మైసూర్ జిల్లాలోని పెరియపట్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దళిత యువకుడిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో కగ్గుండి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి తన 17 ఏళ్ల కుమార్తె షాలిని సోమవారం హత్య చేశాడు. కాగా,వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన షాలిని, మేళ్లహల్లి గ్రామంలో ఉండే మంజునాథ్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలికను పద్ధతి మార్చుకొవాలని పలుమార్లు ఇంట్లో వారు హెచ్చరించారు. అయిన కూడా ఆమె అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది.

దీంతో ఒక రోజు యువతి, ప్రియుడికి ఫోన్ చేసి (Phone call) తనను బలవంతంగా ఎదో చేయాలని కుట్ర చేస్తున్నారని అబ్బాయికి చెప్పుకొని బాధపడింది. "నా కిడ్నాప్, హత్య జరిగితే, ఈ ఆడియో క్లిప్‌ను పెరియపట్న పరిధిలోని పోలీసులకు ,డిజి , ఐజిపికి ఇవ్వండి. ఏదైనా జరిగితే, నా తల్లిదండ్రులు,బంధువులు బాధ్యత వహించాలి" అని ఆమె చెప్పింది.ఆ తర్వాత యువతిని ఆమె తండ్రి అతి కిరాతంగా హత్యచేశాడు.ఈ క్రమంలో.. కూతురిని హత్య చేసిన తర్వాత సురేష్ గురువారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి నేరం అంగీకరించాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka, Traffic challans, Traffic police

ఉత్తమ కథలు