హోమ్ /వార్తలు /క్రైమ్ /

Double bedroom scam : 2లక్షలకే డబుల్ బెడ్రూం ఇల్లు .. కేంద్రమంత్రి ఫోటో అడ్డుపెట్టుకొని బీజేపీ నేత మోసం

Double bedroom scam : 2లక్షలకే డబుల్ బెడ్రూం ఇల్లు .. కేంద్రమంత్రి ఫోటో అడ్డుపెట్టుకొని బీజేపీ నేత మోసం

double bedroom scam

double bedroom scam

Cheaters: నిరుపేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఓ బీజేపీ నాయకుడు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని విక్రయిస్తున్న ముఠాను మహబూబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఏ ధైర్యంతో ఇదంతా చేశాడో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  నిరుపేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఓ బీజేపీ(BJP) నాయకుడు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని విక్రయిస్తున్న ముఠాను మహబూబ్ నగర్(Mahabubnagar)పోలీసులు(Police) అరెస్టు చేశారు. ఒక్కో డబుల్ బెడ్ రూమ్(Double bedroom)ఇంటికి సుమారు 2 - 4 లక్షలు వసూలు చేసినట్లుగా తేలింది. ఈ నకిలీ డాక్యుమెంట్లు(Fake documents)సృష్టించి డబుల్ బెడ్రూంల పేరుతో అమాయకుల్ని మోసం చేసిన ముఠాలో మొత్తం ఆరుగురు సభ్యులున్నట్లుగా తేలింది. పట్టుబడిన ముఠాలో సూత్రధారిగా ఉన్న వ్యక్తి కేంద్రమంత్రి(Union Minister)ఫోటోను అడ్డుపెట్టుకొని ఇదంతా చేశారనే విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

  Telangana : దసరా మామూళ్లు అడిగినంత ఇవ్వలేదని హిజ్రాలు ఏం చేశారో తెలుసా ..?

  ఇళ్ల పేరుతో మోసం ..

  ఇప్పటి వరకు ఫేక్ కరెన్సీ నోట్లు, నకిలీ ధృపత్రాలు, దొంగ సర్టిఫికెట్ల గురించి మాత్రమే విన్నాం. కాని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కూడా తప్పుడు పత్రాలు సృష్టించి అమాయకుల నుంచి లక్షల్లో డబ్బులు కాజేసింది ఓ ముఠా. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన బిజెపి పట్టణ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ హసేన్ అచ్చం డబుల్ బెడ్ రూమ్ పట్టాను పోలిన విధంగానే నకిలీ పట్టాలు తయారు చేసి తన అనుచరులు ఆమేర్, జాఫర్, మెహరున్నిసా, ఇంద్రజ, వెంకటయ్యలతో ఒక ముఠా ఏర్పాటు చేసుకుని అక్రమాలకు తెర తీశాడు.

  డబుల్ బెడ్రూం నకిలీ డాక్యుమెంట్స్..

  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ ఈ ముఠా అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి తమ కంప్యూటర్లో తయారు చేసిన ఫేక్ డాక్యుమెంట్లను, తహసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇవ్వడం ప్రారంభించారు. బిజెపి నాయకుడి మోసాలు తెలియక సుమారు 40 మంది అమాయకులు డబుల్ బెడ్రూం ఇండ్ల ఆశతో డబ్బులు చెల్లించి దారుణంగా మోసపోయారు. నిత్యం ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేసే ప్రతిపక్ష బీజేపీకి చెందిన మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఈ ముఠాకు సూత్రధారి కావడం గమనించదగ్గ విషయం. సదరు నాయకుడు పాలమూరు బీజేపీ నేత పడాకుల బాలరాజు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన ఫొటోనే ఇప్పటికీ తన వాట్సప్ డీపీగా ఉంచుకొనే ఈ వ్యవహారం అంతా నడిపినట్లుగా విమర్శలున్నాయి.

  Telangana : బాన్సువాడలో మళ్లీ పోటీ చేసేది నేనే .. వారసుడి ఆశలపై నీళ్లు చల్లిన స్పీకర్

  అమాయకులకు వల వేసిన బీజేపీ నేత..

  మహబూబ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను ఫోర్జరీ చేసి విక్రయిస్తున్నట్లుగా జిల్లా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి రావడంతో దర్యాప్తు చేయమని ఆదేశించారు. అందులో భాగంగానే అధికార యంత్రాంగం ముమ్మరంగా దర్యాప్తు చేసింది. నకిలీ పట్టాలు పొందిన వారి ద్వారా విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకున్నారు. మొత్తం కుట్రలో బిజెపికి చెందిన నాయకుడే కీలకపాత్రధారి అని పోలీసులు గుర్తించారు. మొత్తం 36 మంది నుంచి రూ. 67,35,00 వసూలు  చేసినట్లు గుర్తించారు.

  పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం ..

  నిందితుల నుంచి రూ. 13,60,000 నగదు, ఫోర్జరీ డాక్యుమెంట్లను, తాసిల్దార్ స్టాంపులను  తయారుచేసిన విధానాన్ని తెలుసుకుని కంప్యూటర్,  ప్రింటర్లు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీపై ఉదయం లేచింది మొదలు కుళ్ళు విమర్శలు చేసే బిజెపి నేతలు... ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి డబుల్ బెడ్ రూం ఇండ్లను విక్రయిస్తున్న మోసగాడు తమ పార్టీకే చెందినవాడు కావడంపై ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సి ఉంది.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Double bedroom houses, Mahbubnagar, Telangana crime news

  ఉత్తమ కథలు