BJP Leader Shot Dead : దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఓ బీజేపీ నేత(BJP Leader)ను అతని నివాసం వద్దే గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి కాల్చి చంపారు. ఢిల్లీలోని(DELHI)మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, జహంగీర్ పురిలో ఉన్న అక్రమ కట్టడాలను NDMC అధికారులు కూల్చివేసిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మయూర్ విహార్ జిల్లా బీజేపీ యూనిట్ కి సెక్రటరీగా జీతూ చౌదరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే జీతూ చౌదరి బుధవారం రాత్రి తన ఇంటి బయటకు వచ్చి నిల్చున్నాడు. అదే సమయంలో బైక్పై ఇద్దరు దుండగులు వచ్చి జీతూ చౌదరిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ క్రమంలో తల, కడుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న చౌదరిని హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు. బుధవారం రాత్రి 8.15 గంటలకు ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.
ALSO READ Crime : వాడిని నమ్మి భర్తకు తెలియకుండా ఆ పని చేసింది..చివరికి నమ్మినవాడే నరకం చూపించాడు
ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఖాళీగా ఉన్న కాట్రిజ్లు, ఇతర ఆధారాలను సేకరించామన్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా, జహంగీర్ పురిలో ఉన్న అక్రమ కట్టడాలను ఎన్డీఎంసీ అధికారులు కూల్చివేసిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. బుధవారం అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ను NDMC అధికారులు ప్రారంభించారు. ఉదయమే పది బుల్డోజర్లు, వందలాది మంది అధికారులు, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతున్నట్టు అప్పుడే సమాచారమిచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్చివేతలను అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.