BJP leader Killed: తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చాలా రోజుల నుంచి జమ్ములో మాటు వేసి భారత భ్రదతా దళాలకు సవాల్ విసురుతున్న ఉగ్రవాదులు అన్నంత పని చేశారు. ఎలాంటి అనుమానం రాకుండాదాడికి తెగబడ్డారు. జమ్మూకాశ్మీర్లో బీజేపీ నేత జావీద్ అహ్మద్ దార్ ను తీవ్రవాదులు దారుణంగా హత్య చేశారు. కుల్గాం జిల్లాలోని బ్రజ్లూ జాగీర్ ప్రాంతంలో జావీద్ అహ్మద్ దార్ ను తీవ్రవాదులు తుపాకీతో కాల్చి చంపారు. మృతుడు జావీద్ అహ్మద్ దార్ ప్రస్తుతం ఓ నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిలకు జారీ చేసేందుకు ఈ హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రజ్లూ జాగీర్ ప్రాంతంలోని జావీద్ అహ్మద్ దార్ ఇంట్లోకి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తీవ్రవాదులు ఒక్కసారిగా ప్రవేశించి ఆయనను తుపాకీతో కాల్చారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. చుట్టు పక్కల అంతా ఉన్నారు. రోడ్డుపై వచ్చే వాళ్లు కూడా భారీగా ఉన్నారు. అయినా అవేవీ పట్టించుకోకుండా నేరుగా బీజేపీ నేత ఇంటికి వచ్చిన ఉగ్రవాదులు.. తమ టార్గెట్ ప్రకారం ఆ నేతను హత్య చేసి.. అక్కడ నుంచి వెళ్లిపోయారు.
జావీద్ మరణించాడాని నిర్ధారించుకున్నంత వరకు అక్కడే ఉన్న తీవ్రవాదులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. కానీ దార్ బతికే అవకాశం ఉంటుందని భావించిన ఆయన కుటుంబ సభ్యులు.. తీవ్ర గాయాలతో ఉన్న జావీద్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భద్రతా దళాలు, పోలీసులు రంగంలోకి దిగి తీవ్రవాదులను కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి.
ఈ ఘటన దురదృష్టకరమని బీజేపీ మీడియా సెల్ ఇంఛార్జీ మంజూర్ అహ్మద్ అన్నారు. ఇలా తుపాకులతో భయపెట్టాలని చూడటం తగదని హితవు పలికారు. బీజేపీ నేతను హత్య చేయడంపై మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు.
కుల్గాంలో బీజేపీ నేతను తీవ్రవాదులు దారుణంగా హత్య గావించిన వార్త ఇప్పుడే అందిందన్నారు. దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. జావీద్ అహ్మద్ దార్ కుటుంబానికి, ఆయన పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఓమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. http://
Terrible news from Kulgam. Javved Ahmed was gunned down in cold blood. I unreservedly condemn this terror attack & send my heartfelt condolences to Javved’s family and colleagues. May Allah grant him place in Jannat. https://t.co/hpNH09u4g0
— Omar Abdullah (@OmarAbdullah) August 17, 2021
ఈ అనూహ్య ఘటనతో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. హత్యకు పాల్పడ్డ ఉగ్రవాదులు గురించి గాలింపు చేపట్టారు. హత్య జరిగే సమయంలో అక్కడ ఎంత మంది ఉన్నారు. బయట ఇంకెవరైనా ఉన్నారు. అసలు వీరందరికీ ఆశ్రయం ఇస్తున్నది ఎవరు అన్నదానిపై నిఘా పెట్టారు.. త్వరగానే వారిని పట్టుకుని అంతమొందిస్తామంటున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, India news, Jammu and Kashmir, National News