BJP LEADER ILLEGAL AFFAIRS EXPOSED ON SOCIAL MEDIA NS
BJP Leader: మహిళా కార్యకర్తతో బీజేపీ నేత కామక్రీడలు.. సోషల్ మీడియాలో బయటపడ్డ బాగోతం!
బయటపడ్డ వీడియోలోని దృశ్యం
BJP: కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ నాయకుడి శృంగార లీలలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. ఓ మహిళా కార్యకర్తతో అతను సాగించిన రాసలీలలకు సంబంధించిన ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి.
అతను ఓ జాతీయ పార్టీకి చెందిన జిల్లా కీలక నేత. తమది క్రమశిక్షణ గల పార్టీ అంటూ ఉపన్యాసాలు ఇస్తాడు. నీతి, నిజాయితీ అంటూ స్పీచ్ లు దంచికొడతాడు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు మనోడు పెద్ద రసికుడు. తన కోరికలను తీర్చుకోవడం కోసం ఏకంగా ఓ మహిళా కార్యకర్తనే ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాకు ఎక్కడంతో అతడి బండారం బయటపడింది. వివరాల ప్రకారం.. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పబడే బీజేపీలో ఓ జిల్లా నేత రాసలీలల వ్యవహరం బయటకు రావడం సంచలనంగా మారింది. కరీంనగర్ కు చెందిన ఓ బీజేపీ జిల్లా నాయకుడు మహిళా కార్యకర్తలతో రాసలీలు సాగించిన వీడియో, ఆడియోలు బయటకు వచ్చాయి.
ఓ మహిళా కార్యకర్తను లోబర్చుకున్న ఆ నేత ఆమెతో కామ కోరికలను తీర్చుకున్నాడు. మోజు తీరక వద్దన్నాడు. దీంతో ఆ మహిళా కార్యకర్త ఆ నాయకుడి బండారాన్ని బయటపెట్టడంతో బేరాలకు దిగాడు. అయితే ఆ బేరాలు బెడిసి కొట్టడం తో ఆయన గారి బండారం మొత్తం బయటకు పండింది. దీంతో మహిళా కార్యకర్తతో సదరు నాయకుడు చేసిన క్రమక్రీడలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ నాయకుడి వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీ నాయకత్వం స్పందించి సదరు నేతపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఈ ఘటనపై పార్టీ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుంది, ఆ నేతపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న అంశం ఆసక్తిగా మారింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.