news18
Updated: November 24, 2020, 8:04 PM IST
ప్రతీకాత్మకచిత్రం
- News18
- Last Updated:
November 24, 2020, 8:04 PM IST
బాలికలపై లైంగికదాడులను అరికట్టడానికి ఎన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ, నాయకులు, అధికారుల అండ చూసుకుని పలువురు రెచ్చిపోతున్నారు. వరుసగా ఇలాంటి తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నా... పలువురిపై కఠిన శిక్షలు పడుతున్నా.. జనాలలో మార్పులు రావడం లేదు. వివాహితులు, యువతులనే గాక.. అభం శుభం తెలియని అమాయక బాలికలనూ కామాంధులు వదలడం లేదు. వారిపై అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కూతురు, చెల్లెలు వయసున్న మైనర్లపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు. ఈ తరహా ఘటనే తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుల్లో ఒక ఎస్ఐ ఉండగా.. మరొకరు బీజేపీ కార్యకర్త అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకెళ్తే... తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఆమెపై ఎన్నోర్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సి.పుగజేంది, అతడి స్నేహితుడు జి. రాజేంద్రన్ (బీజేపీ కార్యకర్త) ల కన్ను పడింది. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని చూశారు. అనుకున్నట్టుగానే గతేడాది సెప్టెంబర్ లో ఆమె పాఠశాల నుంచి ఇంటికి తిరిగివస్తుండగా.. ఆ బాలికను అపహరించారు. రాజేంద్రన్ కార్యాలయంలోకి తీసుకెళ్లి ఆమెను రేప్ చేశారు.
ఆ బాలిక ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఆ వైపుగా వెళ్తే.. మళ్లీ వాళ్ల కంట పడాల్సి వస్తుందని బడి కూడా మానేసింది. అయినా సదరు నిందితులు ఆమెను వదల్లేదు. ఏదో అవసరానికి అటుగా వచ్చిన ఆ బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేసేవారని ఆ బాలిక ఆరోపిస్తున్నది.
దీంతో ఆ బాలిక తాను ఉంటున్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. అక్కడికెళ్లినా ఆమెకు వేధింపులు తప్పలేదు. ఆమె ఉంటున్న బంధువులు సైతం.. ఆ బాలికను వ్యభిచారం చేయాలని బలవంతపెట్టారు. ఇవన్నీ భరించలేని స్థితిలో ఉన్న ఆ బాలిక తిరిగి తల్లి దగ్గరికి చేరుకుని జరిగిందంతా చెప్పేసింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 24, 2020, 8:04 PM IST