అతను కొరికితే సంతాన భాగ్యం.. వెలుగులోకి 'కొరుకుడు బాబా' లీలలు

Biting Baba : కొరుకుడుతోనే సంతానలేమి సమస్యను కూడా పరిష్కరిస్తానని చెప్పి.. ఆడవాళ్ల ఒంటిపై సైతం పంటిగాట్లు పెడుతున్నాడు. మగవారైతే.. వారిని పడుకోబెట్టి తొక్కుతున్నాడు.

news18-telugu
Updated: March 23, 2019, 8:40 AM IST
అతను కొరికితే సంతాన భాగ్యం.. వెలుగులోకి 'కొరుకుడు బాబా' లీలలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రోగమొచ్చినా.. నొప్పి వచ్చినా.. ఆసుపత్రి కంటే బాబాలు, భూత వైద్యుల వద్దకే పరిగెత్తే జనానికి ఇప్పటికీ కొదువ లేదు. తాయెత్తులకు.. చేతి స్పర్శలకు రోగాలు మాయమవుతాయనే అమాయక జనం మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో బాబా ఉదంతం వెలుగుచూసింది. ఈ బాబా పేరు 'కొరుకుడు బాబా..'

భువనగిరి జిల్లా పుల్లాయగూడెంకు చెందిన రాంరెడ్డి అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం 'కొరుకుడు బాబా'గా అవతారమెత్తాడు. అతను కొరికితే చాలు.. ఏ రోగమైనా.. సమస్యయినా.. ఇట్టే పరిష్కారమవుతుందని నమ్మిస్తున్నాడు. అతని మాటలు నమ్మి అమాయక జనం ఎంతోమంది అతని వద్దకు క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.100-రూ.200 వసూలు చేసి.. వారి ఒంటిపై పంటిగాట్లు పెడుతున్నాడు.

కొరుకుడుతోనే సంతానలేమి సమస్యను కూడా పరిష్కరిస్తానని చెప్పి.. ఆడవాళ్ల ఒంటిపై సైతం పంటిగాట్లు పెడుతున్నాడు. మగవారైతే.. వారిని పడుకోబెట్టి తొక్కుతున్నాడు. ఇటీవల ఇతగాని బాగోతం వీడియోల రూపంలో వెలుగుచూడటంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకుని తహశీల్దార్ ముందు హాజరుపరిచారు.
First published: March 23, 2019, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading