మహిళతో వివాహేతర సంబంధం.. రాజకీయ నాయకుడి దారుణ హత్య

తడు వార్నింగ్ ఇచ్చినా చంద్రదేవ్ పట్టించుకోలేదు. ఆ మహిళతో అలాగే వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె భర్త.. సుభాష్ చంద్రదేవ్‌ను హత్యచేయాలని పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశాడు.

news18-telugu
Updated: October 21, 2019, 3:37 PM IST
మహిళతో వివాహేతర సంబంధం.. రాజకీయ నాయకుడి దారుణ హత్య
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 21, 2019, 3:37 PM IST
పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం నేత సుభాష్ చంద్రదేవ్ హత్యం తీవ్ర కలకలం రేపింది. మూడు రోజులుగా ఆయన కనబడకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. సుభాష్‌ను హత్య చేసినట్లు సోమవారం గుర్తించారు. ముక్కలు ముక్కలుగా ఆయన మృతదేహం భాగాలు దొరకడం స్థానికంగా సంచలనం రేపింది. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా కేసు మిస్టరీ వీడింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళలో అక్రమ సంబంధం ఉన్న కారణంగానే ఆయన్ను దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సుభాష్ చంద్రదేవ్ సీపీఎం పార్టీకి చెందిన నాయకుడు. ఓ మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితం వీరి వ్యవహారం సదరు మహిళ భర్తకు తెలిసింది. అతడు వార్నింగ్ ఇచ్చినా చంద్రదేవ్ పట్టించుకోలేదు. ఆ మహిళతో అలాగే వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె భర్త.. సుభాష్ చంద్రదేవ్‌ను హత్యచేయాలని పక్కాగా ప్లాన్ చేసి..దాన్ని అమలు చేశాడు.

సుభాష్‌ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మూడు సంచుల్లో ప్యాక్ చేశాడు. ఓ బ్యాగ్‌ని సమీపంలోని వెదురు తోటలోకి విసిరేసి.. ఇంకో బ్యాగ్‌ని నదిలో పడేశాడు. మరొక సంచి ఓ నిర్మానుష్య ప్రాంతంలో సుభాష్ చంద్రదేవ్ బైక్ సమీపంలో దొరికింది. సుభాష్ కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ దంపతులను కూడా విచారించారు. తమదైన శైలిలో విచారించగా ఆ మహిళ భర్త నేరాన్ని అంగీకరించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే చంపినట్లు ఒప్పుకున్నాడు.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...