Home /News /crime /

BILASPUR POLICE ARREST FOUR FOR RAPING A GIRL ON HER WAY TO A TEMPLE IN CHHATTISGARH SNR

చత్తీస్‌ఘడ్‌లో యువతిపై గ్యాంగ్‌ రేప్..చివరకు అక్కడ కూడా వదలట్లేదు కామాంధులు

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Gang rape: చత్తీస్‌ఘడ్‌లో అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిలాస్పూర్‌ పరిధిలో ఓ యువతి గుడికి వెళ్లి వస్తుండగా నలుగురు యువకులు కాపు కాచి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నలుగురిలో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నలుగుర్ని అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
చత్తీస్‌ఘడ్‌(Chhattisgarh)లో ఓ యువతి సామూహిక అత్యాచారాని (Gang rape)కి గురైంది. బిలాస్పూర్‌ (Bilaspur) లాల్‌కదాన్‌ అండర్‌ బ్రిడ్జ్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. గుడి(Temple)కి వెళ్లి వస్తున్న యువతిపై నలుగురు ఆకతాయిలు(Four brats) వెంబడించారు. యువతి ఆ నలుగురికి చిక్కకుండా పారిపోయే ప్రయత్నం చేసినప్పటికి వాళ్లు పట్టుకున్నారు. నలుగురు యువకుల్లో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. మిగిలిన ఇద్దరు యువకులు మరో ఇద్దరికి సహాకరించారు. ఈ ఘటన అనంతరం బాధిత యువతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో వ్యవహారం బయటపడింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బిలాస్పూర్‌ పోలీసులు(Bilaspur police)కేసు నమోదు చేశారు. యువతిపై బలత్కారం చేసిన నలుగురు ఆకతాయిల్ని(Four accused)పట్టుకున్నారు. వారిపై నిర్భయ చట్టం(Nirbhaya act)తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బిలాస్పూర్‌ పోలీసులు వెల్లడించారు. యువతిని వైద్య పరీక్షల (Medical test)నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈవ్యవహారంలో పోలీసులకు పట్టుబడిన నలుగురు యువకుల్లో గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డారా లేదా అని విచారిస్తున్నారు పోలీసులు. ఒంటిగా కనిపించిన యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఒంటరి యువతిపై సామూహిక అత్యాచారం..
ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, పనులు చేసుకొని ప్రదేశాల్లో కూడా అమ్మాయిలను వేధించే వాళ్లు, కోరికలు తీర్చమని వెంటబడే వాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల భద్రత, చిన్నపిల్లల కిడ్నాప్‌లు పెరిగిపోతుండటంతో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. అయినప్పటికి ఆలయాలు, మందిరాలతో పాటు సీసీ కెమెరాలు లేని చోట ఇలాంటి అఘాయిత్యాలు మరిన్ని జరుగుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

గుడి దగ్గర వదలని కామాంధులు..
చత్తీస్‌ఘడ్‌లో సామూహిక అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలని అక్కడి మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని అత్యాచారాలు చేసే అలాంటి కామంధులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాయి. పట్టుకున్న నలుగురు నిందితులను ప్రజలకు అప్పగిస్తే తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు. పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Chatisghad, Gang rape

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు