Home /News /crime /

BIKERS ASSAULT TRAFFIC POLICE COP IN DELHI AFTER BEING STOPPED FOR VIOLATING RULES PVN

Viral Video : రాంగ్ రూట్ లో ట్రిపుల్ డ్రైవింగ్..అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్ పై పరుగెత్తించి మరీ దాడి!

 ట్రాఫిక్ పోలీసుపై దాడి

ట్రాఫిక్ పోలీసుపై దాడి

Bikers Assault Traffic Police : ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసుపై జనం దాడి చేశారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించారు.  చొక్కా పట్టుకుని ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడుతూ పోలీసుపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడున్న ఉన్నతాధికారులు వారిని అడ్డుకున్నారు.

ఇంకా చదవండి ...
Bikers Assault Traffic Police : ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసుపై జనం దాడి చేశారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించారు.  చొక్కా పట్టుకుని ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడుతూ పోలీసుపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడున్న ఉన్నతాధికారులు వారిని అడ్డుకున్నారు. ఎంతనచ్చజెప్పినా వారిని నిలువరించడం సాధ్యం కాలేదు. సోమవారం ఉదయం పది గంటలకు డియోలి రోడ్ ప్రాంతంలో ఒక స్కూటర్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఒక మహిళ దానిని డ్రైవ్‌ చేస్తున్నది. వీరుముగ్గురు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ కు ముందు భాగంలో నంబర్ ప్లేట్ కూడా లేదు. రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ లేకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆ స్కూటర్‌ను ఆపాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆమె స్కూటర్‌ తాళాలు తీసుకెళ్లడంతో ఆయన ఐడీ కార్డు, ఆ ప్రాంతంలో జరిమానా విధించేందుకు ఉన్న అనుమతిని చూపమని ఆమె అడిగింది.

దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ పోలీస్‌ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఆమెను కొట్టాడు. ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీయగా ఆ మహిళ పలుసార్లు కింద పడిపోయింది. దీంతో ఆయన తనపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించింది. ఇంతలో స్థానికులు ఆ మహిళకు మద్దతుగా ముందుకు వచ్చారు. అక్కడే ఉన్న కొందరు అధికారులు వారికి సర్దిజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినిపించుకోలేదు. కొందరు ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి రాజేంద్ర ప్రసాద్‌పై దాడి చేశారు. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఆయనను వెంబడించి మరీ కొట్టారు. చివరకు పోలీస్‌ అధికారులు, సిబ్బంది అక్కడకు వచ్చారు. ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి రాజేంద్ర ప్రసాద్‌ను బలవంతంగా వారి చెర నుంచి విడిపించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.



Honour Killing : దళిత యువకుడిని ప్రేమించిందని..కన్నకూతురిని గొంతుకోసి చంపిన తండ్రి!


ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీస్ కి గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారిపై దాడి చేయడం, ఆయన విధులకు ఆటంకం కల్పించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారిపై దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Delhi, Delhi police

తదుపరి వార్తలు