ప్రమాదాలు ఎప్పడు, ఎటువైపు నుంచి వస్తాయో చెప్పడం కష్టం. టైం వస్తే మృత్యువు ఏ రూపంలో వస్తుందో కూడా చెప్పలేం. దేశంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల(road accidents)తోనే వందలాది మంది మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో ఎవరూ కూడా అస్సలు ఊహించలేరు. ఒక పక్షి (bird) మృత్యు రూపంలో వచ్చింది. ఓ వాహనదారుడిని బలి తీసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి నెమలి(peacock) తగలడంతో అక్కడికక్కడే మరణించాడు(died). మృతుడిని ప్రమోష్ (34) గా పోలీసులు గుర్తించారు. బైకు(bike)పై ఉన్న ఆయన భార్య గాయపడింది. ఈ విషాద సంఘటన కేరళ(kerala)లోని త్రిసూర్‌లో జరిగింది. ప్రమోష్ సోమవారం తన భార్యను త్రిసూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అయ్యంతోల్ సమీపంలో పొలం నుంచి ఒక్కసారిగా ఎగురుకుంటూ మృత్యువులా నెమలి వచ్చింది. నెమలి రోడ్డు దాటుతూ ఒక్కసారిగా అతడిని ఢీకొట్టింది. అంతే.. మోటార్ సైకిల్ నియంత్రణ కోల్పోయిన ప్రమోద్ రోడ్డు(road)పై పడిపోయాడు. దీంతో ప్రమోష్ అక్కడికక్కడే మరణించగా, అతని భార్య గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమోష్ తన భార్యను డ్రాప్ చేయడానికి త్రిసూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. స్థానికులు వెంటనే కారులో ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ప్రమోష్ మరణించాడని పోలీసులు వెల్లడించారు. అతని భార్యకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో నెమలి కూడా చనిపోయింది. కళేబరాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని ఖననం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ దంపతులు ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. దీంతో ప్రమోష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.