Crime : అన్నా, ఫోన్ పాడైంది.. అర్జెంటుగా కాల్ చేసుకోవాలి..ఈ మాటలు నమ్మడమే అతని పాపమైంది..

Photo Credit : News 18 Kerala

Crime : ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మకూడదు. సాయం చేద్దాం అనుకున్నవారినే మోసం చేస్తున్న రోజులివి. అన్నా..మా ఫోన్ పాడైంది. అర్జెంటుగా కాల్ చేసుకోవాలి. కొంచెం నీ ఫోన్ ఇవ్వవా. ఈ మాటలే అతని కొంపముంచాయ్.

  • Share this:
    ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మామంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కాటేయాలా అని ఆలోచిస్తారు. . అవతలివారిని గుడ్డిగా నమ్మి లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి ఘటనే.. కేరళలోని కోజిగోడ్‌ జిల్లాలోచోటుచేసుకుంది. ఫోన్‌కాల్‌ చేసుకుంటామని చెప్పి మొబైల్‌ఫోన్‌ కొట్టేయడమే కాకుండా అడ్డు వచ్చిన సదరు వ్యక్తిని బైక్‌తో కొద్దిదూరం పాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అసలు వివరాల్లోకెళితే.. బీహార్​కు చెందిన అలీ అక్బర్ కోజిగోడ్‌కు పనినిమిత్తం వచ్చారు. అక్కడే వలస కూలీగా పనిచేసుకుంటా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజులానే పనికి వెళ్లి.. తన పని ముగించుకొని రోడ్డుపై వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. అన్నా..మా ఫోన్ పాడైందని..అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలని అక్బర్ ని అడిగారు. వారి మాటలు నమ్మిన అక్బర్ తన ఫోన్ ను వారి చేతిలో పెట్టాడు. ఇంకేముంది.. తన ఫోన్ ను వారి చేతిలో పెట్టగానే..యువకులిద్దరు బైక్ ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. అయితే..బైకును అక్బర్ పట్టుకుని ఉన్నాడు.

    బైకును అక్బర్‌ పట్టుకొని ఉండడంతో అతన్ని కూడా అలాగే రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో అలీతో పాటు బైకుపై వెనకాల కూర్చున్న దొంగ కూడా కిందపడిపోయాడు. ఆ తర్వాత అక్బర్‌ బైకును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్బర్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

    అయితే, అక్బర్‌ వద్ద ఫోన్‌ దొంగలించిన ఇద్దరు యువకులను సాను కృష్ణన్, షమ్నాస్ అబ్దురాహిమాన్‌లుగా గుర్తించారు. అయితే దుండగులకు చెందిన ఒక ఫోన్ అక్కడ​పడిపోగా స్థానికులు దానిని పోలీసులకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవర్ని పడితే వారిని నమ్మి..ఇలా ఆపదల్లో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: