Lady Constable: అయ్యో దేవుడా.. ఏం తప్పు చేసిందని లేడీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈ యువతికి ఇంతటి శిక్ష..!

హర్షితాబెన్ (ఫైల్ ఫొటో)

ఆ యువతి ఒక కానిస్టేబుల్. పేరు హర్షితాబెన్. గుజరాత్‌లోని జెట్పూర్ తాలూకా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఆమె స్వగ్రామం అమరపర్ గ్రామం. ఆమె పనిచేస్తున్న జెట్పూర్‌కు, ఆమె సొంతూరు అమరపర్‌కు 65 కిలోమీటర్ల దూరం. హర్షితకు ఒక తమ్ముడు ఉన్నాడు.

 • Share this:
  జెట్పూర్: ఆ యువతి ఒక కానిస్టేబుల్. పేరు హర్షితాబెన్. గుజరాత్‌లోని జెట్పూర్ తాలూకా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఆమె స్వగ్రామం అమరపర్ గ్రామం. ఆమె పనిచేస్తున్న జెట్పూర్‌కు, ఆమె సొంతూరు అమరపర్‌కు 65 కిలోమీటర్ల దూరం. హర్షితకు ఒక తమ్ముడు ఉన్నాడు. ప్రతీ సంవత్సరం ఆమె ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా కచ్చితంగా సొంతూరు వెళ్లి తమ్ముడికి రాఖీ కట్టి వచ్చేది. ఆగస్ట్ 22(ఆదివారం) రక్షాబంధన్ కావడంతో తమ్ముడికి రాఖీ కట్టాలని తన స్కూటీపై ఆమె బయల్దేరి వెళుతోంది. అయితే.. ఆమె ప్రయాణం విషాదాంతమైంది. గమ్యం చేరక ముందే ముగిసిపోయింది. తమ్ముడికి రాఖీ కట్టాలని యాక్టివాపై వెళుతున్న ఆ యువతి స్కూటీని ఎదురుగా వేగంగా వస్తున్న మరో బైకర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో హర్షిత తీవ్రంగా గాయపడింది. ఆ బైకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మూల మలుపు వద్ద చూసుకోకుండా.. వేగంగా వచ్చిన ఆ బైకర్ హర్షితను ప్రాణాపాయంలోకి నెట్టేశాడు. తలకు బలంగా రోడ్డు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు ఆమెను రాజ్‌కోట్‌లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ హర్షిత చనిపోయింది. తమ్ముడికి రాఖీ కట్టాలన్న ఆ అక్కను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించేసింది. కలలో కూడా ఊహించలేని ఈ ఘటనతో ఆమె కుటుంబం కన్నీరుమున్నీరయింది. తమ్ముడికి రాఖీ కట్టి వస్తానని చెప్పి ఎంతో ఆశగా వెళ్లిందని.. ఇలా జరుగుతుందని అనుకోలేదని సహోద్యోగులు కంటతడి పెట్టుకున్నారు. అక్క మృతదేహంపై పడి ఆ తమ్ముడు రోదించిన తీరు హాస్పిటల్‌లో ఉన్న వారిని కలచివేసింది.

  గుజరాత్‌లోని బంత్వా గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఐదేళ్ల కూతురితో కలిసి తన తోడబుట్టిన తమ్ముడికి రాఖీ కట్టేందుకు టౌన్‌కు వెళ్లింది. పట్టణంలో నివాసం ఉండే తన తమ్ముడు సోదరితో రాఖీ పండుగ జరుపుకుని ఆమెను, తన మేనకోడలిని బైక్‌పై ఎక్కించుకుని బంత్వాలో వదిలిపెట్టి వచ్చేందుకు బయల్దేరాడు. బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో బైక్‌పై కూర్చున్న ఐదేళ్ల పాప, ఆ వివాహిత కిందపడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆ పాప స్పాట్‌లోనే చనిపోయింది. తన సోదరికి, మేన కోడలికి పూలు కొనిచ్చి బైక్ ముందు భాగంలో పెట్టుకుని వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

  ఇది కూడా చదవండి: Shocking: ఒక అమ్మాయివి అయి ఉండి ఇలా చేయడం తప్పనిపించలేదా తల్లీ.. నీలాంటోళ్లను ఆ దేవుడు కూడా క్షమించడు..

  ఆ పూలు కూడా రోడ్డు మీద ఆ పాప మృతదేహానికి సమీపంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ అక్కాతమ్ముడికి తీవ్రంగా గాయాలయ్యాయి. తమ్ముడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తన పాప చనిపోవడాన్ని తట్టుకోలేక ఆ తల్లి రోదించిన తీరు హృదయవిదారకంగా అనిపించింది. తమ్ముడికి రాఖీ కట్టి తిరిగొస్తుంటే ఇలా జరగడం ఏంటని.. కూతురిని కోల్పోవడం నిజంగా బాధాకరమని ఆ వివాహిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రక్షా బంధన్ సమయంలో దేశమంతంటా సోదరసోదరీ భావం వెల్లివెరిసినా అక్కడక్కడా ఇలాంటి నెత్తుటి మరకలు కూడా కొందరి తోడబుట్టిన వాళ్ల జీవితాల్లో విషాదాన్ని నింపాయి.
  Published by:Sambasiva Reddy
  First published: