HOME »NEWS »CRIME »bihari brothers marry kashmiri girls arrested after in laws file complaint sk

కశ్మీరీ యువతులతో ప్రేమపెళ్లి...ఇద్దరు యువకుల అరెస్ట్

కశ్మీరీ యువతులతో ప్రేమపెళ్లి...ఇద్దరు యువకుల అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం

తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని...ఇష్టపూర్వకంగానే పెళ్లిళ్లు చేసుకున్నామని స్పష్టంచేశారు. బీహార్‌లోనే ఉంటామని..కాశ్మీర్‌కు వెళ్లబోమని పోలీసులతో చెప్పారు. ఐనా జమ్మూకశ్మీర్ పోలీసులు మాత్రం వారి మాటలు వినకుండా పర్వేజ్, తబ్రేజ్‌ని అరెస్ట్ చేసి కాశ్మీర్‌కు తీసుకెళ్లారు.

 • Share this:
  ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ పూర్తిగా భారత్‌లో విలీనమైంది. కశ్మీర్‌లో ఇక ఎవరైనా భూములు కొనుగోళ్లు చేయవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇక కశ్మీరీ యువతను దేశంలోనే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ల వారసత్వ హక్కులను ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ప్రేమ వివాహలు జరుగుతున్నాయి. తమకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకుంటున్నారు యువతులు. రాంబన్ జిల్లాకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా ఇలానే తమ ప్రేమికులను వివాహమాడారు. కానీ కథం అడ్డం తిరిగింది. యువతుల తల్లిదండ్రులు ఆ యువకులపై కేసులు పెట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

  బీహార్‌లోని సుపోల్‌కు చెందిన పర్వేజ్, తబ్రేజ్ అన్నాదమ్ముళ్లు. వీరిద్దరు జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన అక్కాచెలెళ్లతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఐతే వారి పెళ్లికి ఇన్నాళ్లు ఆర్టికల్ 370 అడ్డంకిగా మారింది. ఇటీవలే ఆర్టికల్ 370ని రద్దుచేయడంతో ఈ రెండు జంటలు పెళ్లి చేసుకున్నాయి. అనంతరం బీహార్‌లోని సుపోల్ కాపురం పెట్టాయి. తమ కూతుళ్లు బీహారీ యువకులను పెళ్లి చేసుకోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వారి భర్తలపై కిడ్నాప్ కేసుపెట్టారు.  రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్ పోలీసులు బీహార్‌కు వెళ్లి కేసును దర్యాప్తు చేశారు. ఆ ఇద్దరు యువతులు అక్కడే ఉన్నారని గుర్తించి రెండు జంటలను విచారించారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని...ఇష్టపూర్వకంగానే పెళ్లిళ్లు చేసుకున్నామని స్పష్టంచేశారు. బీహార్‌లోనే ఉంటామని..కాశ్మీర్‌కు వెళ్లబోమని పోలీసులతో చెప్పారు. ఐనా జమ్మూకశ్మీర్ పోలీసులు మాత్రం వారి మాటలు వినకుండా పర్వేజ్, తబ్రేజ్‌ని అరెస్ట్ చేసి కాశ్మీర్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:August 29, 2019, 18:24 IST