హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Nizamabad: కిరాణా దుకాణానికి వెళ్దామని చెప్పి.. పదేళ్ల బాలికను పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం..

Nizamabad: కిరాణా దుకాణానికి వెళ్దామని చెప్పి.. పదేళ్ల బాలికను పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nizamabad: కిరాణా దుకాణానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర బాలికపై బీహార్ యువకుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Nizamabad

-nzbనిర్భయ లాంటి ఎన్నో క‌టిన చ‌ట్టాలు వ‌చ్చినా.. కోర్టులు ఉరిశిక్షలు విధిస్తున్నా..  కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు.  ఎక్క‌డో ఓ చోట బాలిక‌ల‌పై ఆఘాయిత్యాలు జ‌రుగుతునే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆల‌స్యంగా వెలుగు చూసింది. కిరాణా దుకాణానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర బాలికపై బీహార్ యువకుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు.

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..    నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలంలోని దేగాం గ్రామంలోని ఓ ఇటుకల బట్టిలో మహారాష్ట్రకు చెందిన కుటుంబ సభ్యులు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పది సంవత్సరాల వయసున్న  బాలిక ఉంది. స్థానికంగా ఓ ఇల్లు  అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే బీహార్ రాష్ట్రానికి చెందిన సుమారు 30 మంది యువకులు వ‌రి నాటు వేసేందుకు గ్రామానికి వ‌చ్చారు.  వారు కూడా మ‌హారాష్ట్ర వారి ఇంటి ప్ర‌క్క‌నే ఉంటున్నారు. వీరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల పొలాలకు వెళ్లి వరి నాట్ల పనులు చేసుకుంటున్నారు.

అమ్మాయి కోసం నెట్‌లో వెతికాడు .. అడ్డంగా బుక్కయ్యాడు

ఈనెల 2వ తేదీన రాత్రి 8 గంటల ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన కుటుంబం నివసించే ఇంట్లోకి బిహార్ కు చెందిన ఓ యువకుడు వచ్చి  బాలికను కిరాణా దుకాణానికి రమ్మని  తీసుకువెళ్లాడు. బాలికను దుకాణానికి తీసుకెళ్లిన యువకుడు రాత్రి 11 గంటలైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన మిగతా యువకులు వెతికారు.  గ్రామ శివారులో చిన్నారి బాలిక పై యువకుడు అత్యాచారానికి పాల్పడడంతో.. ఆ చిన్నారి రక్తం మరకలతో కనిపించింది.  ఇది గ‌మ‌నించిన  యువకులు.. బాలికను గ్రామానికి తీసుకెళ్లారు.  చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడిని చితకబాదారు.   బాలికకు రక్తస్రావమై పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం ఆర్మూర్ లోని ఆస్పత్రిలో చికిత్స చేయించడానికి తీసుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయనిదే.. అడ్మిట్ చేసుకోబోమని చెప్పడంతో..వారు పలు ఆస్పత్రులు తిరిగారు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉండడంతో.. తిరిగి గ్రామానికి వెళ్లిపోయారు.

బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన మంగళవారం గ్రామస్తులకు తెలియడంతో..  వారు బీహార్ కు చెందిన యువకుడిని చితకబాది గదిలో బంధించినట్లు సమాచారం. అత్యాచార విషయం పోలీసులకు తెలిస్తే ఇబ్బందులు తప్పవని.. బీహారీలు భావించారు.  బాలికకు ఆర్మూర్ లో చికిత్స చేయిస్తామని మొదట చెప్పారు. కానీ అత్యాచారానికి గురైన బాలికకు చికిత్స చేయిస్తే.. ఎలాగైనా పోలీసులకు  సమాచారం తెలుస్తుందని.. ఆస్పత్రికి వెళ్లకపోవడమే మంచిదని బాధిత బాలిక కుటుంబ సభ్యులను ప్రాధేయపడ్డారు.  వారికి డబ్బులు ఇచ్చి.. ఈ విషయం పోలీసులు, ఆస్పత్రుల వరకు వెళ్లకుండా చేశారని.. స్థానికులు చెబుతున్నారు.

First published:

Tags: Child rape, Nizamabad, Telangana

ఉత్తమ కథలు