Home /News /crime /

BIHAR WOMAN HELD FOR GIVING RS 1 LAKH SUPARI OF HER HUSBAND OVER LOVE AFFAIR WITH BROTHER IN LAW PAH

వామ్మో.. భర్త పనిమీద వెళ్లగానే మరిదితో ఎఫైర్.. ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నాడని..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bihar:  భర్త సోదరుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఉద్యోగానికి వెళ్లగానే.. తన మరిదితో ఇంట్లోనే మజా చేసేది. అయితే.. భర్తకు ఎక్కడ దొరికిపోతామో అని ఎప్పుడు టెన్షన్ పడుతుండేది.

కొంత మంది మహిళలు ఆడతనానికే మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ, అడ్డమైన పనులు చేస్తున్నారు. మరికొంత మంది మరీ దిగజారీ, మూడు ముళ్ల బంధాన్ని కూడా బజారుకు ఈడ్చుకుంటున్నారు. పెళ్లి తర్వాత.. కూడా ఎఫైర్ లు పెట్టుకుంటు.. తమ పరువును, కుటుంబపు పరువును బజారులో పెట్టుకుంటున్నారు. ఇంటిపక్కన వారితో, ఎదురింటితో వారితో వివాహేతర సంబంధాలు (Extramarital affair) కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. బీహర్ లో (Bihar)  దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న నవ్ గాచియాలోని గోపాల్ పూర్ పరిధిలో దారుణమైన ఉదంతం జరిగింది. జూలై 26 న జరిగిన ఈ అమానవీయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పప్పు గుప్తా, ప్రీతి గుప్తా భార్యభర్తలు. అయితే.. వీరితో పాటు.. భర్త సోదరుడు కూడా ఒకే ఇంట్లో ఉండేవారు. ఈ క్రమంలో ప్రీతి గుప్తా, మరిదితో వివాహేతర సంబంధం (Affair)  పెట్టుకుంది. భర్త ఉద్యోగం మీద వెళ్లగానే ఇద్దరు కలసి గడిపేవారు. అయితే.. తమ గుట్టు ఎక్కడ భర్తకు తెలిసిపోతుందో అనుకుంటూ భయపడేవారు. భర్త అడ్డుతొలగించుకుంటూ.. యథేచ్ఛగా తిరగోచ్చని భావించారు.

అందుకు భార్య ప్రీతి గుప్తా మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను చంపాల్సిందిగా ఒక లక్షరూపాయలను సుపారీగా ఇచ్చింది. దీని కోసం అడ్వాన్స్ గా 20 వేలను కూడా ఇచ్చింది. అయితే.. భర్త ఉద్యోగం నుంచి ఇంటికి వస్తుండగా కొంత మంది అటకాయించి , పిస్టల్ తో కాల్చి, కత్తులతో పొడిచి చంపారు. అయితే.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.



కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తి భార్య, సోదరుడి.. వాలకం అనుమానస్పదంగా ఉండటంతో ఇద్దరిని, పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమదైన రీతిలో విచారించారు. కాల్ డాటాను పరిశీలించారు. ఈ క్రమంలో తాము.. ప్లాన్ ప్రకారం.. భర్తను హత్య చేసినట్టు అంగీకరించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Crime news, Illegal affairs

తదుపరి వార్తలు