హోమ్ /వార్తలు /క్రైమ్ /

కొత్త మురిపెం ఇంకా తీరనేలేదు.. మొగుడికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన భార్య.. ఏంచేసిందో తెలుసా..?

కొత్త మురిపెం ఇంకా తీరనేలేదు.. మొగుడికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన భార్య.. ఏంచేసిందో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bihar:  పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగింది. దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తమ ఇంటికి కోడలు రావడంతో అత్తింటి వారు పొంగిపోయారు. ఇంటి నిండా బంధువులున్నారు.

కొంత మంది వివాహ బంధానికి ఉన్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత.. చేసుకున్న పెళ్లి ఇష్టం లేక మధ్యలోనే వదిలి పుట్టింటికి వచ్చేస్తున్నారు. మరికొందరు పెళ్లికి (Marriage)  ముందు ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. పెద్దల బలవంతం మీద వివాహం చేసుకున్న కొద్ది రోజులకే, తమ ప్రియుడితో కలిసి పారిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, మరో ఘటన నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. బీహర్ లో (Bihar) ఒక పెళ్లింట షాకింగ్ ఘటన జరిగింది. ముంగేర్ గ్రామ పరిధిలో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉంటే వివేక్ పొద్దార్ కు, మోనా అనే అమ్మాయికి జూన్ 14 న వైభవంగా పెళ్లి (Wedding)  జరిగింది. ఈ క్రమంలో.. జూన్ 16 న రిసెప్షన్, 18న పుట్టింటికి వెళ్లి అత్తగారింటికి 21న వచ్చింది. అయితే, భర్తతో సరదాగా మార్కెట్ వెళ్దామని చెప్పింది. దీనికోసం అందంగా ముస్తాబైంది. నగలు పెట్టుకుంది. వివేక్ కూడా తన భార్య.. మాట కాదన లేక పోయాడు. తన పనిని కూడా పక్కన పెట్టేసి భార్యతో కలిసి మార్కెట్ కు వెళ్లాడు.

అయితే, అక్కడ మోనా షాపింగ్ చేసింది. భర్త చేయిపట్టుకుని రద్దీలో వెళ్తుంది. అయితే, కొంత సేపటికి భార్య, భర్త చేయి వదిలేసింది. వెనుక చూసేసరికి ఆమె లేదు. ఆమె కోసం వెతికాడు. అయితే.. అక్కడే కొద్ది దూరంలో ఒక స్కార్పియో ఉంది. దానిలో మోనా,మరో యువకుడితో కలిసి వెళ్లడాన్ని (Woman elopes with lover) చూశాడు. తనకోసం వెతకొద్దని భార్య అతనికి చెప్పింది. దీంతో భర్త వివేక్ షాకింగ్ కు గురయ్యాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి వివేక్ తన కుటుంబంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య.. అత్తింటి వారు పెట్టిన నగలన్ని వేసుకుని మరీ ఉడాయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా పెళ్లి వేడుకలో ఊహించని విషాదం జరిగింది.

ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  పెళ్లి వేడుక విషాదకరంగా మారింది. అప్పటి దాక... డ్యాన్స్ లు , డీజేల హోరు, వరుడిని ఊరేగిస్తున్న బంధువులు, స్నేహితులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే, వరుడు బరాత్ లో కూర్చోబెట్టారు. సోమ్ భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వరుడు మనీష్ మధేషియా అందరిముందు ఒక తుపాకీ తీశాడు. దాన్ని అందరికి చూపిస్తు ఆకాశంలో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత .. అది పేలలేదు. ఈ క్రమంలో అతను.. గన్ ను మరోసారి కిందకు తీసుకొని ట్రిగ్గర్ నొక్కాడు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. గన్ నుంచి బుల్లెట్ దూసుకొచ్చి అతను (Groom Kills Friend In Wedding) స్నేహితుడికి పొట్ట భాగంలో తగిలింది.

First published:

Tags: Bihar, Crime news, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు