• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • BIHAR WIDOW ALLEGES TWO RELATIVES GANGRAPED ME IN FRONT OF HER MINOR SON SU

నా కొడుకు ముందే నన్ను రేప్ చేశారు.. బంధువులపై పోలీసులకు ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?

నా కొడుకు ముందే నన్ను రేప్ చేశారు.. బంధువులపై పోలీసులకు ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?

ప్రతీకాత్మక చిత్రం

బంధువులే తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు వ్యక్తులు కలిసి తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించింది.

  • Share this:
    బంధువులే తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు వ్యక్తులు కలిసి తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించింది. ఆమె కొడుకు ముందే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారన తెలిపింది. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లోని జమూయి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. 30 ఏళ్ల మహిళ కొంతకాలం కిందట భర్తను కోల్పోయింది. ఆమెకు ఇద్దరకు కుమారులు కాగా, పెద్ద కుమారుడు(16) సూరత్‌లో పనిచేస్తున్నాడు. ఇక, ఆమె చాకై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో తన చిన్న కుమారుడితో కలిసి నివసిస్తోంది. అతనికి 13 ఏళ్లు. అయితే సోమవారం అర్ధరాత్రి ఆమె కజిన్ భర్త సుఖ్‌దేవ్ యాదవ్, అతని బామ్మర్ధి మహేంద్ర యాదవ్.. ఆ మహిళ ఇంట్లోకి ప్రవేశించారని.. తన కొడుకు ముందే ముందే గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది.

    ఆ తర్వాత ఆమె కొడుకు తల్లిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఈ ఘటనపై ఫిర్యాదు చేయించాడు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ఆ మహిళ మొదట తన ఫిర్యాదులో నిందితులు ఇద్దరు తనను కేవలం కొట్టారని పేర్కొందని చెప్పారు. అయితే బుధవారం స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే సమయంలో నిందితులు తనపై లైంగిక దాడి చేశారని చెప్పిందని అన్నారు. దీంతో ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కూడా ఎఫ్‌ఐఆర్‌తో జత చేసినట్టు చెప్పారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల కోసం పంపామని.. ఆ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్టు వెల్లడించారు.

    అత్యాచారం జరిగినట్టు ఫిర్యాదు చేసిన మహిళకు, నిందితుడు సుఖ్‌దేవ్‌తో భూ వివాదం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ వివాదం కారణంగా మహిళ అత్యాచార ఆరోపణలు చేసిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడున్నట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు