హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: 60 ఫీట్ల ఐరన్ బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలాంటి చోరీ గురించి ఎక్కడా విని ఉండరు

OMG: 60 ఫీట్ల ఐరన్ బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలాంటి చోరీ గురించి ఎక్కడా విని ఉండరు

దొంగలు ఎత్తుకెళ్లిన బ్రిడ్జి ఇదే

దొంగలు ఎత్తుకెళ్లిన బ్రిడ్జి ఇదే

Bridge robbery: మూడు రోజులుగా దొంగలు బ్రిడ్జిని తరలిస్తున్నా ఉన్నతాధికారుల దృష్టికి మాత్రం ఈ సమాచారం వెళ్లలేదు. రెండు రోజుల తర్వాత అసలు విషయం తెలిసి గ్రామస్తలుతో పాటు అధికారులు కూడా ఖంగుతిన్నారు. వచ్చింది నీటి పారుదల శాఖ అధికారులు కాదు.. దొంగలని తెలియడంతో.. అందరూ నోరెళ్లబెట్టారు.

ఇంకా చదవండి ...

    దొంగలంటే విలవైన నగలనో లేదంటే డబ్బులనో చోరీ చేస్తారు. చైన్ స్నాచర్లు మహిళ మెడల్లో ఉన్న పుస్తెలను తెంచుకెళ్తారు. ఇంకొందరు దొంగలు రాత్రిళ్లు ఇళ్లల్లోకి చొరబడి సర్వం ఊడ్చేస్తారు. కాస్త పెద్ద దొంగలైతే బ్యాంకులు, జ్యుయెల్లరీ షాపులను కన్నం పెడతారు. ఇలాంటి దొంగల గురించి మనకు తెలుసు. టీవీల్లో కూడా చూస్తుంటాం. కానీ బ్రిడ్జిని కూడా ఎత్తుకెళ్లే దొంగలను ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? బీహార్‌లో ఈ షాకింగ్ రాబరీ జరిగింది. 60 ఫీట్లు పొడవు.. 20 టన్నుల బరువుంటే.. ఐరన్ బ్రిడ్జిని దోచుకెళ్లారు. రోహ్‌తాస్ జిల్లాలోని నస్రీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమియావర్ గ్రామంలో ఈ చోరీ జరిగింది. వంతెనను దొంగలు ఎత్తుకెళ్లిన తీరును చూసి పోలీసులే ఖంగుతిన్నారు.

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అమియావర్ గ్రామంలోని అరా కాల్వలపై 1972లో ఇనుప వంతెనను నిర్మించారు. ప్రస్తుతం అతి శిథిలావస్థలో ఉంది. బ్రిడ్జి వాడుకలో లేదు. ఐతే అది ఐరన్ బ్రిడ్జి కావడంతో కొంత మంది దొంగల కన్ను పడింది. పెద్ద మొత్తంలో ఇనుము ఉండడంతో దానిని ఎలాగైనా కాజేయాలని పథకం పన్నారు. కొంత మంది దొంగల ముఠా నీటి పారుదలశాఖ అధికారుల రూపంలో గ్రామానికి వెళ్లారు. ఇక్కడ కొత్త బ్రిడ్జి రాబోతోందని.. పాడైపోయిన ఈ బ్రిడ్జిని తొలగిస్తున్నామని చెప్పారు. స్థానిక గ్రామ పంచాయతీ అనుమతి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత జేసీబీ, పికప్ వ్యాన్, గ్యాస్ కట్టర్‌ వంటివి తీసుకొచ్చి.. బ్రిడ్జి తరలింపును ప్రారంభించారు. గ్యాస్ కట్టర్‌ల సాయంతో ఇనుప వంతెనను ముక్కలు ముక్కలుగా కోశారు. వాటిని జేసీబీలనుతో పెకిలించి.. ట్రక్కుల్లో ఎక్కించి తీసుకెళ్లారు. మూడు రోజుల్లోనే బ్రిడ్జిని మాయం చేశారు.

    Viral Video: లవ్ చేయమని టార్చర్ పెట్టాడు..యూపీ పోలీసులు ఎలాంటి ట్రీట్ ఇచ్చారో చూడండి

    ఐతే మూడు రోజులుగా దొంగలు బ్రిడ్జిని తరలిస్తున్నా ఉన్నతాధికారుల దృష్టికి మాత్రం ఈ సమాచారం వెళ్లలేదు. రెండు రోజుల తర్వాత అసలు విషయం తెలిసి గ్రామస్తలుతో పాటు అధికారులు కూడా ఖంగుతిన్నారు. వచ్చింది నీటి పారుదల శాఖ అధికారులు కాదు.. దొంగలని తెలియడంతో.. అందరూ నోరెళ్లబెట్టారు. ఈ వంతెన చాలాకాలంగా వినియోగంలో లేదు. దానిని తొలగించాలని గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతలోనే అధికారుల పేరుతో కొందరు వచ్చి బ్రిడ్జిని తొలగించడంతో.. గ్రామస్తులు కూడా సహకరించారు. కానీ వారు దొంగలని తెలిసి.. షాక్ తిన్నారు. మొత్తం 20 టన్నుల బ్రిడ్జిని ముక్కలు ముక్కలుగా చేసి.. తీసుకెళ్లారని స్థానికులు చెప్పారు. ఇలా అందరినీ బురిడీ కొట్టించి.. పట్ట పగలే బ్రిడ్జిని చోరీ చేయడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

    ఎగ్జామ్ తప్పించుకునేందుకు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బాలిక పరార్.. కానీ సంచలన ట్విస్ట్

    ఘటనపై నీటిపారుదల శాఖ అధికారులు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజినీర్ అర్షద్ కమల్ షమ్సీ మాట్లాడుతూ.. వంతెనను శిథిలావస్థలో ఉందని చెప్పారు. చాలా ఏళ్లుగా కొంత మంది వ్యక్తులు కొంచెం కొంచెంగా ఇనుమును కాజేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జిని తొలగించాల్సి ఉందని.. అంతలోనే ఇలా చోరీకి గురయిందని చెప్పారు. ఈ వ్యవహారంపై నస్రీగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

    .

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bihar, Robbery

    ఉత్తమ కథలు