Home /News /crime /

BIHAR TEACHER MERCILESSLY THRASHES 5 YEAR OLD BOY LOSES CONSCIOUSNESS PAH

కోచింగ్ సెంటర్ లో దారుణం.. ఐదేండ్ల చిన్నారిపై ఉపాధ్యాయుడి పైశాచికం.. జుట్టు పట్టుకుని..

చిన్నారిని కొడుతున్న టీచర్

చిన్నారిని కొడుతున్న టీచర్

Bihar: ట్యూషన్ సెంటర్ లో టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. చిన్నారిని జుట్టు పట్టుకుని గొడ్డులాగా బాదాడు. బాధతో ఏడుస్తున్న ఏమాత్రం కూడా కనికరించ లేదు.

కొంత మంది ఉపాధ్యాయులు, తమ ఉద్యోగానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తారు. కొందరు విద్యార్థుల పట్ల అత్యంత దారుణాలకు పాల్పడుతుంటారు. విద్యా, బుద్ధులు నేర్పించాల్సిన వారే.. పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తారు. కీచకులుగా మారి.. విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొందరు కంట్రోల్ తప్పి, విద్యార్థులపై దాడులు చేస్తుంటారు. స్టూడెంట్స్ ను ఇష్టమోచ్చినట్లు కొడుతుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. బీహర్ లో (Bihar) దారుణ ఘటన జరిగింది. పాట్నాలోని ధనరువా బ్లాక్ లో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా జయ అనే కోచింగ్ సెంటర్ ఉంది. దానిలో చిన్న పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో.. ఐదేండ్ల చిన్నారిని ఛోటు అనే ఉపాధ్యాయుడు ఇష్టమోచ్చినట్లు కొట్టాడు. జుట్టుపట్టుకుని గొడ్డును బాదినట్లు బాదాడు. అతను బాధతో విలవిల్లాడుతూ స్పృహ కోల్పోయాడు. దీంతో సిబ్బంది చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

చిన్నారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, దీనిపై కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అమర్ కాంత్ స్పందించారు. ఛోటు అనే ఉపాధ్యాయుడి చిన్నారిపై దాడిచేశాడని (Teacher thrashes boy)  తెలిపాడు. అతనికి అధిక రక్తపోటు ఉందని అందుకే ఇలా చేశాడని అన్నారు. స్థానికులు ఈ ఘటనను రికార్డు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో (Delhi) అమానుష సంఘటన జరిగింది.

పశ్చిమ్‌ విహార్‌లో ఈ ఘటన సంభవించింది. రక్షిత్, ధరమ్‌వీర్ దహియా అనే వ్యక్తులు ఒకే ఏరియాలో ఉంటారు. అయితే, రక్షిత్ ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, ప్రతిరోజు అది అరుస్తూ ధరమ్ వీర్ కు ఇబ్బంది కలిగించేది. కొన్ని రోజుల పాటు భరించాడు. ఈ క్రమంలో ధరమ్ వీర్ వాకింగ్ వెళ్లి వస్తుండగా.. కుక్క అతడిని (Barking Hits Dog) కరిచింది.వెంటనే అతను ఇంటికి వెళ్లి ఒక ఇనుప రాడ్ ను తీసుకొచ్చాడు. రక్షిత్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

రక్షిత్, అతని కుక్కపై రాడ్ తో బలంగా కొట్టాడు. దెబ్బకు ఇద్దరు కూడా నెలమీద పడ్డారు. అయితే, మరో మహిళ ధరమ్ వీర్ ను ఆపడానికి ప్రయత్నించింది. అతనిపై కూడా ధరమ్ వీర్ దాడిచేశాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు (viral video)  అయ్యింది. స్థానికులు.. వెంటనే రక్షిత్ , మరో మహిళను ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా కుక్క కరిచిందని ధరమ్ వీర్ కూడా ఆస్పత్రికి వెళ్లాడు. పాపం.. కుక్క తలకు కూడా రక్తం గడ్డ కట్టింది. దాన్ని వెటర్నరీ వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారంతా పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Crime news, Harassment

తదుపరి వార్తలు