కట్నం కోసం మరో నిండు ప్రాణం బలైంది. కొడుకుకు ప్రమోషన్ రావడంతో.. అదనపు కట్నం తేవాల్సిందిగా కొడలిపై అత్తామామలు ఒత్తిడి తెచ్చారు. అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో.. కోడలిని అత్తింటివారు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లోని నలంద జిల్లాలోని చోటుచేసుకుంది. వివరాలు.. పాట్నా జిల్లాలోని సలీంపూర్‌లో నివసిస్తున్న అరవింద్ సింగ్ కుమార్తె కాజల్ కుమారికి, హిల్సా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన నోనియా విఘా నివాసి జగత్ ప్రసాద్ కుమారుడు సంజిత్ కుమార్ గతేడాది జూన్ 27న వివాహం జరిగింది. పెళ్లి జరిగిన సమయంలో సంజిత్ కుమార్ గ్రూప్ డి పోస్టులో రైల్వేలో పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవల టీటీఈగా ప్రమోషన్ లభించింది. సంజిత్‌కు పదోన్నతి లభించిన వెంటనే మరో నాలుగు లక్షల కట్నం డిమాండ్ కావాలని అతడి కుటుంబ సభ్యులు కాజల్‌ను ఒత్తిడి చేశారు.
అయితే కాజల్ కుటుంబం అంత మొత్తం చెల్లించలేకపోయింది. దీంతో అత్తింటివారు గర్భంతో ఉన్న కాజల్‌ను దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి పూడ్చిపెట్టారు. మరోవైపు అత్తింట్లో ఉన్న కూతురు కనిపించకపోవడం, ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో.. కాజల్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాజల్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే కొన్ని రోజులుగా కాజల్‌కు హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నోనియా విఘాలోని ఓ పొలంలో ముక్కలుగా ఉన్న కాజల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుున్నారు. హత్య తర్వాత ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసిన ఆనవాళ్లు కూడా అక్కడ లభించాయి. అనంతరం.. కాజల్ మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం అక్కడి నుంచి తరలించారు.
సంజిత్‌కు ప్రమోషన్ రావడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 80 వేల రూపాయలు ఇచ్చినట్టుగా కాజల్ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వారి అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో ఇవ్వకపోవడంతో సంజిత్, అతడి కుటుంబ సభ్యులు కాజల్‌ను హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలు కాజల్ తండ్రి అరవింద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంజిత్తో సహా మొత్తం 5 గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని.. నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.