పట్టపగలే దారుణ హత్య.. వెంబడించి కాల్చివేశారు.. ఆ వివాదాలే కారణమా?.. వారిద్దరు ఒకరిపై ఒకరు నిందలు..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు అతడిని కాల్చి చంపారు.

 • Share this:
  ఓ వ్యక్తి పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు అతడిని కాల్చి చంపారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లో చోటుచేసకుంది. వివరాలు.. పర్సా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అతడిని ఎత్వార్‌పూర్‌కు చెందిన జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. జితేంద్ర ఆటోలో వెళ్తున్న సమయంలో ముగ్గురు దుండగులు బైక్స్‌పై అతడిని వెంబడించారు. తప్పించుకునేందుకు ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. చివరకు జితేంద్ర‌ను పట్టుకుని కాల్చి చంపారు. తలపై కాల్చడంతో జితేంద్ర కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా నెలపై కుప్పకూలిపోయాడు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో జితేంద్ర మృతిచెందాడు.

  జితేంద్రను హత్య చేసిన అనంతరం దుండగులు.. తమ చేతుల్లోకి తుపాకీలను జనాలకు చూపెడుతు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు విచారణ నిమిత్తం ట్రైనీ డీఎస్పీ ప్రియ జ్యోతి ఘటన స్థలానికి చేరుకుని.. పరిసరాలను పరిశీలించారు. తలపై కాల్పులు జరపడం వల్ల జితేంద్ర మరణించాడని ఆమె చెప్పారు.

  ఇక, గత రెండు మూడు రోజుల క్రితం జితేంద్ర కుటుంబ సభ్యులతో గొడవపడినట్టుగా చుట్టుపక్కల ఉన్న కొందరు వ్యక్తులు తెలిపారు. జితేంద్ర కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారని.. ఈ విషయంలో తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు చెప్పారు. కుటుంబ వివాదాల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని ట్రైనీ డీఎస్పీ ప్రియ జ్యోతి అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసును లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉందన్నారు.

  ఈ సంఘటన తర్వాత జితేంద్ర ఇద్దరు పర్సా బజార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు నిందించుకోవడం ప్రారంభించారు. జితేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు వెల్లడించారు.
  Published by:Sumanth Kanukula
  First published: