పశువుల దొంగగా భావించి..వృద్ధుడిని రాళ్లతో కొట్టి చంపారు..

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే వారం రోజులు గడిచినా..ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

news18-telugu
Updated: January 4, 2019, 3:49 PM IST
పశువుల దొంగగా భావించి..వృద్ధుడిని రాళ్లతో కొట్టి చంపారు..
నమూనా చిత్రం
  • Share this:
55 ఏళ్ల పెద్దమనిషి..! కాళ్లా వేళ్లాపడ్డాడు..! తాను ఏ తప్పూ చేయలేదని ప్రాధేయపడ్డాడు. కాళ్లు మొక్కుతా.. వదిలిపెట్టమని వేడుకున్నాడు..! కానీ దుండగులు మాత్రం కనికరించలేదు. రాక్షసుల్లా మారి..వృద్ధుడని కూడా చూడకుండా చావబాదారు. కర్రలతో, రాళ్లతో మూకుమ్మడిగా దాడిచేశారు. రక్తపు మడుగులో తల్లడిల్లుతున్నా..వాళ్ల రాతి గుండె కరగలేదు..! ముఖం..తలంపై పిడిగుద్దులు కురిపించారు. దెబ్బలకు తాళలేక ఆ వృద్దుడు అక్కడే కుప్పకూలిపోయాడు. చివరకు ప్రాణాలు విడిచాడు. బీహార్‌లోని అరారియాలో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూకదాడి ఘటన ఇప్పుడు బీహార్‌లో సంచలనం రేపుతోంది.

అరారియా జిల్లాలోని ఓ గ్రామంలో డిసెంబరు 29న దొంగలు పడ్డారు. ఓ వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న ఆవులను దొంగిలించేందుకు యత్నించారు. గ్రామస్తులు గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. వెంబడించినా దొరకలేదు. కొంత దూరం వెళ్లిన తర్వాత గ్రామస్తులకు మహ్మద్ కాబుల్ (55) అనే వృద్ధుడు కంటపడ్డాడు. అతడిని దొంగగా భావించి గ్రామస్తులంతా చావబాదారు. ఎవరూ అడ్డుకోకపోవడంతో కాబుల్‌ను చిత్తకొట్టారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. డిసెంబరు 30న ఉదయం అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే వారం రోజులు గడిచినా..ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పోలీసులు కేసును లైట్‌గా తీసుకుంటున్నారంటూ మృతుడి బంధువులు మండిపడుతున్నారు. ఘటనపై స్పందించిన కలెక్టర్..అరారియా జిల్లాలో శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

First published: January 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>