BIHAR MAN HELD FOR MARRYING 12 GIRLS INCLUDING MINORS PUSHING THEM INTO PROSTITUTION PAH
OMG: మైనర్లతో సహా 12 మందితో పెళ్లి.. షాక్ లో పోలీసులు.. అందరిని ఏంచేశాడో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
Bihar: తనకు పెళ్లి కాలేదని చెప్పి అమ్మాయిలతో యువకుడు పరిచయం పెంచుకునేవాడు. ఒకరికి తెలియకుండా.. మరొకరితో.. దాదాపు 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. అందరిని వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి కొన్ని రోజులు కాపురం చేసేవాడు.
కొంత మంది కేటుగాళ్లు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. పెళ్లి చేసుకుని వారిని చిత్రహింసలక గురిచేస్తుంటారు. కొంత మంది కట్నం కోసం మహిళలను వేధిస్తుంటారు. మరికొందరు.. పెళ్లి (Wedding) చేసుకొని మోజు తీరిపోయాక ముఖం చాటేస్తుంటారు. భార్యను విడిపించుకొవడానికి రకరకాల ప్లాన్ లు వేస్తుంటారు. మరికొంత మంది దుర్మార్గులు భార్యలను వేరే చోటకు తీసుకెళ్తారు. అక్కడ వారికి తెలియకుండా అమ్మేస్తారు. ఇలాంటి అనేక ఘటనలు గతంలో వెలుగులోనికి వచ్చాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. బీహర్ లో (Bihar) దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కిషన్ గంజ్ జిల్లాలోని కొచ్ఛాధమన్ పరిధిలోని అనార్కలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాగా,అనార్కలి గ్రామానికి చెందిన మహ్మద్ షంషాద్ అలియాస్ మనోహర్ అనే వ్యక్తి అనేక మందిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో.. బిజ్వార్కు చెందిన మహ్మద్ హసీబ్ 2015 నవంబర్ 27న తన మైనర్ కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్పి కిడ్నాప్ చేశాడని అప్పట్లోనే కేసు నమోదైంది.
ఆ తర్వాత.. తిరిగి జైలు నుంచి వచ్చిన అతని బుద్ధి మారలేదు. ఇతను ఇప్పటి వరకు 8 మందితో పాటు, మరో నలుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.. వారిని వెస్ట్ బెంగాల్ లో వ్యభిచారం చేసే వారికి విక్రయించాడు. కాగా, బాధితురాలి కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు మనోహర్ ను పూర్నియా పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకున్న వారంతా.. ముస్లిం సామాజిక వర్గం వారిగా పోలీసుల విచారణలో తెలింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
ఇదిలా ఉండగా కర్ణాటకలో ఒక బ్యాంకు మేనెజర్ యువతి హనీ ట్రాప్ వలలో పడ్డాడు.
ఇండియన్ బ్యాంక్ లో ఆడిట్ కు వచ్చిన అధికారులు డబ్బులు నిల్వలు తక్కువగా ఉండటంతో ఆరా తీయగా ఘటన వెలుగులోనికి వచ్చింది. బెంగళూరులోని హనుమంతనగర్లో ఉన్న ఇండియన్ బ్యాంక్ మేనెజర్ హరిశంకర్, డేటింగ్ యాప్ లో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాల్స్.. వరకు వెళ్లింది. హరిశంకర్ ఆమె బుట్టలో పడిపోయాడు. ఈ క్రమంలో.. తన ప్రియురాలి కోసం కస్టమర్ లు బ్యాంక్ లో పెట్టిన సోమ్మును ఆమె చెప్పిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేశాడు.
అతగాడు.. ఏకంగా .5.7 కోట్లను యువతి చెప్పిన అకౌంట్ లకు మళ్లించాడు. కాగా, మే 13 నుంచి 19 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో 28 ఖాతాలకు, కర్ణాటకలోని 2 ఖాతాలకు.. మొత్తం 136 లావాదేవీల్లో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతని పర్సనల్ డబ్బులు.. 12.5 లక్షలను కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిశంకర్ ను అరెస్టు చేశారు. అనేక కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.