నాలుగో పెళ్లికి సిద్దమైన భర్త.. చితక్కొట్టిన మొదటి భార్య..

ముంతాజ్‌ను చూడగానే అతని వద్దకు పరిగెత్తిన మొదటి భార్య అతన్ని చితకబాదింది.పోలీసులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుపడ్డారు. వారు కూడా ముంతాజ్‌ను చితకబాదారు.

news18-telugu
Updated: July 5, 2019, 7:50 PM IST
నాలుగో పెళ్లికి సిద్దమైన భర్త.. చితక్కొట్టిన మొదటి భార్య..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 5, 2019, 7:50 PM IST
నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన ముంతాజ్ అనే ఓ వ్యక్తిని అతని మొదటి భార్య కోర్టు వద్దే చితకబాదిన ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. మరో మహిళతో కలిసి అతను కోర్టులో కనిపించడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. కోర్టు సమక్షంలో అతను ఆమెను పెళ్లి చేసుకునేందుకు అక్కడికి వచ్చినట్టు సమాచారం. ముంతాజ్‌ను చూడగానే అతని వద్దకు పరిగెత్తిన మొదటి భార్య అతన్ని చితకబాదింది.పోలీసులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుపడ్డారు. వారు కూడా ముంతాజ్‌ను చితకబాదారు. పోలీస్ వాహనంపై దాడి చేశారు.అయితే ఎలాగోలా ముంతాజ్‌ను ఆ మూక నుంచి తప్పించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.కాగా, ముంతాజ్ తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో నాలుగో పెళ్లికి సిద్దమయ్యాడు.ముంతాజ్‌కు ఇదివరకే పెళ్లయిన సంగతి ఆ యువతికి తెలుసా లేదా అన్నది తెలియరాలేదు.ముంతాజ్ మొదటి భార్య ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో ముంతాజ్ పెళ్లిళ్లపై నిజాలు నిగ్గు తేలుస్తామని అన్నారు.


First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...