Home /News /crime /

BIHAR GIRL JUMPS OFF MOVING TRAIN TO ESCAPE MOLESTATION BID RPF BEGINS PROBE PAH

OMG: అయ్యో.. తోడేళ్ల మధ్యన జింక మాదిరిగా... కదులుతున్న రైలులో నుంచి దూకిన యువతి.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bihar: యువతి ట్రైన్ లో వెళ్తుంది. ఆమె ఒంటరిగా ప్రయాణిస్తుంది. అయితే, కొంత మంది పోకిరీలు ఆమెను వేధింపులకు గురిచేశారు.

కామాంధులకు అకృత్యాలకు (Harassment) అంతే లేకుండా పోయింది. మహిళలు, అమ్మాయిలపై వేధింపుల పర్వాన్ని మాత్రం మానుకోవడం లేదు. ప్రభుత్వాలు దిశ, పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన వీరి వీరి దారుణాలకు అంతే లేకుండా పోయింది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. ప్రతిరోజు మహిళలు, అమ్మాయిలపై వేధింపులు ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇలాంటి ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. బీహర్ లో (Bihar) అమానుష సంఘటన జరిగింది. సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బెగుసరాయ్ గ్రామానికి చెందిన యువతి.. ముజఫర్ నుంచి బరౌని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా యువతి, కకోర్బాధా రైల్వే స్టేషన్ సమీపంలోని సమస్తిపూర్-బరౌని రైల్వే లైన్ లో ప్రయాణిస్తుండగా ఈ అమానుషం జరిగింది. యువతి రైలులో సింగిల్ ఉంది. దీంతో కొంత మంది ఆకతాయిలు ఆమెను వేధించారు. ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నారు. తాకడానికి ప్రయత్నించారు.

రైలు కోచ్ లో ఎవరు లేకపోవడం,రైలు వేగంగా వెళ్తుండటంతో యువకులు మరింత రెచ్చిపోయారు. యువతిని అసభ్యంగా (Harassment)  తాకుతూ.. దుర్భాషలాడారు. దీంతో భయపడిపోయిన యువతి.. వెంటనే ట్రైన్ లోని ఎక్సిట్ దగ్గరకు చేరుకుంది. జన్ సధారన్ రైలు చైన్ లాగడానికి ప్రయత్నించింది. కానీ ఆకతాయిలు ఆమె ప్రయత్నాన్ని అడ్డగించారు. ఇక బాత్రూమ్ వద్దకు వెళ్లి.. రైలు డోర్ తెరచింది. రైలు వేగంగా వెళ్తుంది. దీంతో ఆకతాయిలు ఆమె వైపుకు వస్తున్నారు. దీంతో భయపడిపోయిన యువతి వెంటనే కిందకు దూకేసింది. దీంతో బాధితురాలకి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, యువతిని అక్కడే ఉన్న రైల్వే పోలీసు చూశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.

జునైద్ పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాజకుమారికి ఇద్దరు కూతుళ్లు. జ్యోతి, అర్చన. వీరిద్దరు బులంద్ షహర్ కు చెందిన అభిషేక్, దీపక్ లను ప్రేమించారు. అయితే , వీరి పెళ్లికి అమ్మాయిల తల్లి అంగీకరించింది. కానీ యువకుల తరపు వారు పెళ్లికి (Wedding) వ్యతిరేకించారు. దీంతో వారు కోపంతో రగిలిపోయారు. ఎలాగైన తన వారి అడ్డు తొలగించుకొవాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఒక రోజు రాజకుమారి, వారిని తమ ఇంటికి భోజనానికి రావాల్సిందిగా కోరింది. వీరు గ్రామానికి దగ్గరగా ఉండటం వలన తరచుగా కలుస్తు ఉండేవారు.

ఈ క్రమంలో రాజకుమారి ఆహ్వనం మేరకు విందుకు హజరయ్యారు. అయితే, ఆహరంలో తల్లికూతుళ్లు విషం కలిపారు. దీనికి అభిషేక్ కూడా సహకరించాడు. ఆహరం తిన్న కాసేపటికే వీరు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిన చూసిన వైద్యులు వీరు తిన్న ఆహరం పాయిజన్ అయ్యిందని అన్నారు. దీంతో బాధిత బంధువులు, రాజకుమారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోనికి తీసుకొని విచారించారు. కూతుళ్లతోపాటు, అభిషేక్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Female harassment, Harassment

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు