బిహార్ (Bihar)లో దోపిడి దొంగలు (Thieves gang) రెచ్చిపోయారు. ఓ కిరాణా షాపులోకి చొరబడి ఓనర్ని బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లారు. అయితే తన డబ్బు పోగొట్టుకోవడానికి ఇష్టపడని షాపు యజమాని దొంగలతో చాలా సేపు ఫైటింగ్ చేసినప్పటికి ఒంటరివాడు కావడంతో దోపిడీ ముఠా అతడ్ని చితక్కొట్టి లక్షల రూపాలు లూఠీ చేసుకెళ్లారు. దర్బాంగా(Darbhanga)లోని ఘనశ్యాంపూర్ (Ghanshyampur)పోలీస్ స్టేషన్ పరిధిలోని రసియార్ గ్రామంలో ఉన్న జ్వాలాముఖి కిరాణషాపు (Grocery shop)లో ఈ రాబరీ జరిగింది. సోమవారం(Monday) సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఐదారుగురు ఆగంతకులు ముఖాలకు మాస్కులు ధరించి షాపులోకి చొరబడ్డారు. చేతుల్లో కత్తులు, ఇనుప రాడ్లు ఉండటంతో షాపు యజమాని రాధేశ్యామ్ షాకయ్యాడు. వాళ్లకు ఎదురు చెప్పలేకపోయాడు. షాపులో చొరబడ్డ దొంగలు ముందుగా యజమానిని కౌంటర్లో ఉన్న డబ్బంతా ఇవ్వమని డిమాండ్ చేశారు. అందుకు అతను నిరాకరించడంతో దొంగలు అతడ్ని చితకబాదారు. క్యాష్ లాకర్లో డబ్బులు ఉండటంతో యజమాని రాధేశ్యామ్ (Radheshyam)అక్కడి నుంచి కదలకుండా నిల్చోవడంతో దొంగలకు అనుమానం వచ్చి అతడ్ని అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లి కొట్టారు. లాకర్లోని డబ్బుల కట్టలను లెక్కిస్తూ ఓ దొంగ బ్యాగులో పెట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు యజమాని రాధేశ్యామ్‌ని కొట్టడం మొదలుపెట్టారు. ఎలాగైనా దొంగల దగ్గరున్న తన డబ్బు తీసుకోవాలని షాపు ఓనర్ ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. దోపిడి దొంగలు షాపులోకి వచ్చిన సమయం నుంచి డబ్బు దోచుకెళ్లే వరకు అంతా షాపులో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డైంది. మొత్తం 14లక్షల(14Lakhs) రూపాయలు ఎత్తుకెళ్లారు.
దోపిడి దొంగల బీభత్సం..
దొంగల ముఠా షాపులో చొరబడి సుమారు అరగంట సేవు యజమానిని కొడుతూనే ఉన్నారు. లాకర్లో ఉన్న పదమూడు లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. షాపులోకి ఆయుధాలతో వచ్చిన దొంగల ముఠా దోచుకున్న డబ్బును పట్టుకొని నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తన డబ్బు పోవడంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు బాధితుడు రాధేశ్యామ్. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌కి దగ్గరలో లూఠీ జరగడం. పట్టపగలు అందరూ చూస్తుండగా దొంగలు పారిపోవడం అంతా సీసీ కెమెరాలో రికార్డైనప్పటికి దొంగల్ని పట్టుకోవడంలో పోలీసులు చురుగ్గా వ్యవహరించలేదని విమర్శలు వస్తున్నాయి. రాబరీ జరిగి 24గంటలు గడిచినప్పటికి ఆరుగురు దొంగల్లో ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారు పోలీసులు. రాబరీ జరిగిన షాపులో సీసీ దృశ్యాలు మాత్రం తెగ వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Gang robbery