యువతికి ఎస్ఎంఎస్‌తో బీహార్ గ్యాంగ్ వల... ఆ తర్వాత ఏం జరిగిందంటే

Cyber Crime | ఐడీ కార్డులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి డాక్యుమెంట్లు అడిగేసరికి నిజమేనని నమ్ముతారు కస్టమర్లు. ఇలా తెలివిగా నమ్మించి ఆ తర్వాత వేర్వేరు కారణాలతో డబ్బులు గుంజుతుంటారు.

news18-telugu
Updated: January 4, 2020, 6:32 PM IST
యువతికి ఎస్ఎంఎస్‌తో బీహార్ గ్యాంగ్ వల... ఆ తర్వాత ఏం జరిగిందంటే
యువతికి ఎస్ఎంఎస్‌తో బీహార్ గ్యాంగ్ వల... ఆ తర్వాత ఏం జరిగిందంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ యువతి దారుణంగా మోసపోయిన ఘటన ఇది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి స్నాప్‌డీల్‌లో రూ.228 విలువైన స్పైరల్ పొటాటో కటర్ కొన్న కొన్ని రోజులకు QP-SNDEAL పేరుతో ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. "స్నాప్‌డీల్‌ కంపెనీలో ఆన్‌లైన్ షాపింగ్ చేసినందుకు మీరు రూ.6,90,000 విలువైన టాటా నెక్సాన్ కారు గెలుచుకున్నారు. కంపెనీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.6,500 చెల్లిస్తే చాలు. మరిన్ని వివరాల కోసం 18003133226 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా 06289633543 నెంబర్‌కు వాట్సప్ చేయండి" అన్నది ఆ మెసేజ్ సారాంశం. రూ.6,90,000 విలువైన కారు గెలుచుకున్నట్టు మెసేజ్ రాగానే ఆ యువతి సంబరపడిపోయింది. వెంటనే అందులో ఉన్న నెంబర్లకు కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తాను Snapdeal.com కంపెనీ ఉద్యోగి సత్య ప్రకాష్ అని చెప్పాడు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.6,500 చెల్లించాలని కోరాడు. ఆమె డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. అంతటితో ఆగలేదు. వేర్వేరు కారణాలతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు. ఆర్‌టీఓ ఛార్జీలు రూ.24,600, జీఎస్టీ రూ.18,500, ఇన్స్యూరెన్స్ ఛార్జీలు రూ.31,000, కార్ చెకింగ్ ఛార్జీలు రూ.74,400, ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలు రూ.50,000, డ్రైవర్ ఛార్జీలు రూ.25,000 ట్రాన్స్‌ఫర్ చేసింది ఆ యువతి. ఇలా మొత్తం రూ.2,30,000 వేర్వేరు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసింది. రూ.6,90,000 విలువైన కారు వస్తుందని నమ్మి రూ.2,30,000 చెల్లించింది. చివరకు ఇదంతా మోసమని గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది.

Prize money scam, Bulk sms scam, Car prize scam, Cyber Crime, Cyberabad Police, Bihar gang, Hyderabad news, బీహార్ గ్యాంగ్, ప్రైజ్ మనీ స్కామ్, బల్క్ ఎస్ఎంఎస్ స్కామ్, కార్ ప్రైజ్ స్కామ్, సైబర్ క్రైమ్, సైబరాబాద్ పోలీస్, హైదరాబాద్ వార్తలు
ప్రతీకాత్మక చిత్రం


యువతి ఫిర్యాదుతో కేసు పెట్టిన పోలీసులు... ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. యువతిని మోసం చేసిన బీహార్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్‌లు, నకిలీ వెబ్‌సైట్లను ఉపయోగించుకొని మోసాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఇద్దరు పరారీలో ఉన్నారు. అసలు ఈ ముఠా మోసాలకు ఎలా పాల్పడుతోందని ఆరా తీస్తే పెద్ద కథే బయటపడింది. వీరిలో ప్రధాన నిందితుడు సందీప్ కుమార్ అలియాస్ ఆర్యన్ చదివింది ఇంటరే. 2016 నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడు. స్నాప్‌డీల్, షాప్ క్లూస్, క్లబ్ ఫ్యాక్టరీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, న్యాప్‌టాల్ లాంటి సంస్థల నుంచి కస్టమర్ల వివరాలను ముందుగా సేకరిస్తారు. ఎవరెవరు ఏఏ వస్తువులు కొన్నారో తెలుసుకుంటారు. వాళ్ల ఫోన్ నెంబర్లకు ముందుగా ఎస్ఎంఎస్‌లు పంపిస్తారు. మీరు రూ.6,90,000 విలువైన కారు గెలుచుకున్నారని నమ్మిస్తారు. కారు మీకు డెలివరీ చేయాలంటే కంపెనీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.6,500 చెల్లిస్తే చాలని చెబుతారు. రూ.6,500 ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.6,90,000 విలువైన కారు వస్తుందని నమ్మి చాలామంది మోసపోతుంటారు. ఐడీ కార్డులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి డాక్యుమెంట్లు అడిగేసరికి నిజమేనని నమ్ముతారు కస్టమర్లు. ఇలా తెలివిగా నమ్మించి ఆ తర్వాత వేర్వేరు కారణాలతో డబ్బులు గుంజుతుంటారు.

Prize money scam, Bulk sms scam, Car prize scam, Cyber Crime, Cyberabad Police, Bihar gang, Hyderabad news, బీహార్ గ్యాంగ్, ప్రైజ్ మనీ స్కామ్, బల్క్ ఎస్ఎంఎస్ స్కామ్, కార్ ప్రైజ్ స్కామ్, సైబర్ క్రైమ్, సైబరాబాద్ పోలీస్, హైదరాబాద్ వార్తలు
ప్రతీకాత్మక చిత్రం
మీకూ ఇలాంటి ఎస్ఎంఎస్‌లు, ఇమెయిల్స్ వస్తున్నాయా? అయితే వాటిని పట్టించుకోకండి. ఎవరైనా కాల్ చేసి మీరు కారు గెలుచుకున్నారని, ప్రైజ్ వచ్చిందని, డబ్బులు మీ అకౌంట్‌లో వేస్తామని చెబితే అస్సలు నమ్మొద్దు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువై పోయాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. బహుమతులు గెలుచుకున్నట్టు ఏ ఇ-కామర్స్ కంపెనీ కూడా బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపదన్న విషయం గుర్తుంచుకోండి. బల్క్ ఎస్ఎంఎస్‌లో వచ్చే ఇలాంటి మెసేజ్‌లను అస్సలు నమ్మొద్దు. అందులో ఉన్న నెంబర్లకు కాల్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా పదేపదే కాల్ చేసి బహుమతులు ఇస్తామని చెబుతుంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి.

Realme X2 Pro: 33 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... రియల్‌మీ ఎక్స్2 ప్రో ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 2156 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

Save Money: నెలకు రూ.5,000 పొదుపు... మీ అకౌంట్‌లో రూ.1 కోటి రిటర్న్స్... పొందండి ఇలా

ఈ సమస్యకు పరిష్కారం చెబితే రూ.35 లక్షలు మీవే...
First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు