Home /News /crime /

BIHAR CM NITISH KUMAR ATTACKED IN BAKHTIYARPUR DURING EVENT ACCUSED ARRESTED MKS

Nitish Kumar Attacked: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై దాడి : Bihar CM Shocking Video

సీఎం నితీశ్ పై దాడి దృశ్యం

సీఎం నితీశ్ పై దాడి దృశ్యం

మరో ప్రముఖ నేత భద్రతలో భారీ వైఫల్యం చోటుచేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పై దాడి జరిగింది. పంజాబ్ లో ప్రధాని మోదీ సెక్యూరిటీ బ్రీచ్ తర్వాత అతిపెద్ద ఘటన ఇదే..

దేశంలో మరో ప్రముఖ నేత భద్రతలో భారీ వైఫల్యం చోటుచేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పై దాడి జరిగింది. సొంత ఊరు బక్తియార్ పూర్ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొనగా, ఓ వ్యక్తి పోలీసులను దాటేసుకుంటూ వెళ్లి దాడికి పాల్పడ్డాడు. దుండగుడి చర్యకు సీఎం నితీశ్ బిత్తరపోగా, పోలీసులు ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సంచలనంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్లగా, ఫిరోజ్ పూర్ లో ఆయన భద్రతలో భారీ వైఫల్యం తలెత్తడం తెలిసిందే. మళ్లీ రెండు నెలల వ్యవధిలో ఓ పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఏకంగా దాడి జరగడం కలకలం రేపుతున్నది.

బక్తియార్ పూర్ పర్యటనలో భాగంగా సీఎం నితీశ్ ఇవాళ స్వాతంత్రయోధులకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం బీహార్ నుంచి పోరాడిన స్వాతంత్య్రోద్య‌మ పోరాట యోధుడు శిల్‌భ‌ద్ర యాజి విగ్ర‌హం బక్తియార్‌పూర్ ప‌ట్ట‌ణంలో ఉంది. బ‌క్తియార్‌పూర్‌లోని ఆస్పత్రి ప్రాంగ‌ణంలో గ‌ల శిల్ భ‌ద్ర‌యాజి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పిస్తున్న సమయంలో సీఎం నితీశ్‌పై దాడి జరిగింది.

Samantha: పాన్ ఇండియానా బొక్కా! -సమంత స్టన్నింగ్ వీడియో -Ultra Miami


ముఖ్యమంత్రిపై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని గురించి విచారిస్తున్నారు. సీఎంను కొట్టిన వ్యక్తికి మతిస్థిమితం లేనట్లుగా కొన్ని చానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.

KCR దూకుడుకు అమిత్ షా కళ్లెం! -ఢిల్లీ నుంచే మిషన్ తెలంగాణ ఆపరేషన్ -రంగంలోకి ఆ 26 మంది?




బీహార్ లో బీజేపీ-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోన్న సీఎం నితీశ్ కుమార్ ఆ మధ్య బీజేపీ నుంచి విడిపోడానికి ప్రయత్నించినా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మనసుమార్చుకుని కమలనాథులతోనే ఉండిపోయారు. పార్టీ గత తీర్మానాలకు భిన్నంగా బీహారేతర రాష్ట్రాల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత సొంత రాష్ట్రంలో నితీశ్ పాల్గొన్న తొలి కార్యక్రమంలోనే దాడి జరగింది.
Published by:Madhu Kota
First published:

Tags: Attack, Bihar, JDU, Nitish Kumar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు