హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..

పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వధువును కూడా పెళ్లి పీటల వద్దకు తీసుకురమ్మని పురోహితుడు చెప్పాడు. దీంతో వధువు తన గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె వస్తూ పెళ్లి పీటల మీద కూర్చున్న వరుడిని చూసింది. అంతే ఒక్కసారిగా ఆమె అడుగులు ఆగిపోయాయి..

కొద్ది నిమిషాల్లో పెళ్లి. వరుడు పీటల మీద కూర్చున్నాడు. పెళ్లి మండపం అంతా బంధువులతో కోలాహలంగా ఉంది. వధువును కూడా పెళ్లి పీటల వద్దకు తీసుకురమ్మని పురోహితుడు చెప్పాడు. దీంతో వధువు తన గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె వస్తూ పెళ్లి పీటల మీద కూర్చున్న వరుడిని చూసింది. అంతే ఒక్కసారిగా ఆమె అడుగులు ఆగిపోయాయి. ఒక్క క్షణం వరుడి వైపు తీక్షణంగా చూసి వెనక్కు వెళ్లిపోయింది. తన గదిలోకి వెళ్లి దిగాలుగా కూర్చుంది. ఏం జరిగిందా అని కుటుంబ సభ్యులు వెళ్లి అడిగితే అసలు కారణం చెప్పింది. అంతే ఆ పెళ్లి కూతురి అక్క ఆమెను తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. పెళ్లికి వచ్చిన వాళ్లందరికీ ఏం జరుగుతోందో కాసేపటి దాకా అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అంతా తమ తమ ఊళ్లకు వెళ్లిపోయారు. పెళ్లి కొడుకు కుటుంబం కూడా ఉసూరుమంటూ తమ గ్రామానికి వెళ్లిపోయింది. ఇంతకీ అసలు కథేంటంటే..

బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లా బెత్తైహ్ పరిధిలోని శాంక్యా మై లోని నౌతాన్ బ్లాక్ లో శుక్రవారం ఓ పెళ్లి జరగాల్సి ఉంది. నాథూ చౌదరి అనే అమ్మాయికి అదే జిల్లాలోని బాఘీ ముషారీ ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమయింది. ఈ పెళ్లి కోసమే ఇరు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రులంతా దగ్గరలోనే ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. పెళ్లి పీటలపై పెళ్లి కొడుకు కూడా కూర్చున్నాడు. వధువును తీసుకురండంటూ పురోహితుడు చెప్పడంతో ఆమె బయటకు వచ్చింది. వస్తూవస్తూనే వరుడిని చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్క క్షణం పాటు అక్కడే నిలబడి వెనక్కు వెళ్లిపోయింది. ఏమయిందా ఏంటా? అని కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు. అప్పుడు ఆమె నోరు విప్పింది.

ఇది కూడా చదవండి: ఒక్క ఘటనతో వరుడికి డబుల్ షాక్స్.. తెల్లవారుజామున వధువును తీసుకెళ్లిన తాత.. చివరకు సీన్ రివర్స్

’నాకు వాట్సప్ లో పంపిన అబ్బాయి ఫొటో వేరు. ఇప్పుడు పెళ్లి పీటల మీద ఉన్న వరుడి ఫొటో వేరు. తప్పుడు ఫొటో పంపి నన్ను మోసం చేశారు. నాకు ఈ అబ్బాయి నచ్చలేదు. నేను ఈ పెళ్లి చేసుకోను‘ అంటూ ఆ యువతి చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిప్రాయాన్ని గౌరవించిన కుటుంబ సభ్యులు ఆమెతో సహా ఆ పెళ్లి మండపం నుంచి తమ ఇంటికి వెళ్లిపోయారు. అసలేం జరుగుతోందో తెలియక అక్కడ బంధుమిత్రులంతా అయోమయ స్థితిలో ఉండిపోయారు. ఆలస్యంగా అసలు విషయం తెలిసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అటు వరుడి కుటుంబ సభ్యులు కూడా చేసేదేమీ లేక తమ స్వగ్రామానికి వెళ్లిపోయారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదనీ, వరుడి తరపు వారు కానీ, వధువు తరపు వారు కానీ ఫిర్యాదు చేస్తే తప్పక విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: రాత్రి పెళ్లి.. తెల్లారే అత్తారింటికి పంపిస్తోంటే కుప్పకూలిపోయిన వధువు.. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పింది విని..

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Love marriage, Marriage reception, Wife kill husband

ఉత్తమ కథలు